Oona Chaplin : వార్ని.. ‘అవతార్’లో విలన్ చార్లీ చాప్లన్ మనవరాలా.. ఈమె గురించి తెలుసా?
తాతయ్య తన కామెడీతో అందర్నీ నవ్విస్తే మనవరాలు ఊనా చాప్లిన్ మాత్రం అందర్నీ తన విలనిజంతో భయపెట్టింది. (Oona Chaplin)
Oona Chaplin
Oona Chaplin : ఇటీవల వచ్చిన అవతార్ పార్ట్ 3 గత రెండు సినిమాలతో పోలిస్తే ప్రేక్షకులను అంతగా మెప్పించలేకపోయింది. పార్ట్ 2 కథనే మళ్ళీ చూపించారని విమర్శలు కూడా వచ్చాయి. అయితే ఫైర్ & యాష్ అనే టైటిల్ పెట్టి దానికి తగట్టు కొంత భాగం మాత్రం చూపించారు.(Oona Chaplin)
ఈ ఫైర్ & యాష్ జాతికి లీడర్ గా వరంగ్ అనే పాత్రలో ఊనా చాప్లిన్ నటించింది. నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో ఊనా చాప్లిన్ తన నటనతో మెప్పించింది. అయితే ఈ ఊనా చాప్లిన్ ఎవరో తెలిసి అంతా ఆశ్చర్యపోతున్నారు. ఈ ఊనా చాప్లిన్ ఎవరో కాదు హాలీవుడ్ స్టార్ కమెడియన్, తన సినిమాలతో ప్రపంచమంతా నవ్వించిన చార్లీ చాప్లిన్ మనవరాలు.
Also Read : Allu Arjun : అల్లు అర్జున్ నెక్స్ట్ నాలుగు సినిమాలు ఫిక్స్.. బన్నీ వాసు క్లారిటీ..
చార్లీ చాప్లిన్ కూతురు గెరాల్డైన్ కూతురే ఊనా చాప్లిన్. తన తాత, అమ్మ బాటలోనే నటనలోకి ఎంట్రీ ఇచ్చింది ఊనా చాప్లిన్. 20 ఏళ్లకే షార్ట్ ఫిలిమ్స్ తో కెరీర్ మొదలుపెట్టిన ఊనా చాప్లిన్ ఆ తర్వాత హాలీవుడ్ లో టీవీ షోలు, సిరీస్ లు, సినిమాలు చేస్తుంది. కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా కూడా చేసింది. హాలీవుడ్ లో ఈమె చార్లీ చాప్లిన్ మనవరాలు అని తెలిసినా ఈ అవతార్ సినిమాతో ప్రపంచమంతా తెలిసింది.
తాతయ్య తన కామెడీతో అందర్నీ నవ్విస్తే మనవరాలు ఊనా చాప్లిన్ మాత్రం అందర్నీ తన విలనిజంతో భయపెట్టింది.
Also Read : Vijaya Bhaskar : పాపం డైరెక్టర్ ని పక్కన పెట్టేశారా..? నువ్వు నాకు నచ్చావ్ రీ రిలీజ్ ప్రమోషన్స్..
