Bail To Shivalinga Prasad : హీరో నాగశౌర్య తండ్రి శివలింగప్రసాద్ కు బెయిల్
మంచిరేవుల పేకాట కేసులో హీరో నాగశౌర్య తండ్రి శివలింగప్రసాద్ బెయిల్ మంజూరు అయింది. ఉప్పర్ పల్లి కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.

Bail
Manchirevula cards playing case : మంచిరేవుల పేకాట కేసులో హీరో నాగశౌర్య తండ్రి శివలింగప్రసాద్ బెయిల్ మంజూరు అయింది. ఉప్పర్ పల్లి కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. శివలింగప్రసాద్ ను అరెస్టు చేసిన పోలీసులు… రాజేంద్రనగర్ ఉప్పర్ పల్లి కోర్టులో హాజరుపర్చారు. దీంతో శివలింగప్రసాద్ తరపున కోర్టులో న్యాయవాది బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.
గుత్తా సుమన్ తో కలిసి శివలింగ ప్రసాద్ పేకాట దందా నిర్వహిస్తోన్నట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన్ను అరెస్టు చేశారు. ఉప్పర్ పల్లి కోర్టులో హాజరుపర్చగా.. శివలింగ ప్రసాద్ కు కోర్టు బెయిల్ మంజూరు చేసింది.