Urfi Javed comments on police complaint filed on her
Urfi Javed : హిందీ బిగ్‌బాస్ షో ద్వారా ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్న నటి ‘ఉర్ఫీ జావేద్’. అయితే ఆ ఫేమ్‌ని మరెంత పెంచుకోడానికి ఈ భామ చేసే పనులు మాములుగా ఉండవు. బోల్డ్ షో చేసేలా డ్రెస్‌లు వేసుకుంటూ బహిరంగంగా బాలీవుడ్ విధుల్లో హల్‌చల్ చేస్తుంటుంది. ఇక సోషల్ మీడియాలో అయితే తన ప్రైవేట్ పార్ట్స్ చూపిస్తూ మితిమీరిన బోల్డ్‌నెస్‌తో తీవ్ర విమర్శలు ఎదురుకుంటుంది.
Urfi Javed : బిగ్‌బాస్ నటిపై నమోదైన పోలీస్ కేసు..
అయినా సరే ఈ బోల్డ్ భామ మాత్రం ఆ విమర్శలు పట్టించుకోకుండా తనకి నచ్చినట్లు చేసుకుంటూ పోతుంది. ఇటీవల ఈ భామ ఆగడాలకు విసుగెత్తిపోయిన మహారాష్ట్ర మహిళా మోర్చా చీఫ్ చిత్ర కిషోర్, పోలీసులకు పిర్యాదు చేసింది. ఈ పిర్యాదు మేరకు పోలీసులు కూడా చర్యలు తీసుకున్నారు. కాగా దీనికి ఉర్ఫీ జావేద్ స్పందిస్తూ.. ‘వ్యక్తిని బట్టి వల్గారిటీ, న్యూడిటీకి అర్ధం మారుతుంది. అయినా నా ప్రైవేట్ పార్ట్స్ చూపించనంతవరకు నన్ను జైల్లో వెయ్యలేరు కదా’ అంటూ వ్యాఖ్యానించింది.
కాగా ఇటీవల దుబాయ్ వెళ్లిన ఈ భామ.. అక్కడ కూడా ఇలానే బోల్డ్ డ్రెస్ వేసుకొని షో చేయడంతో.. అక్కడ పోలీసులు ఆమెకు సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. ఇన్ని జరిగిన ఈ బోల్డ్ భామకి ఏమాత్రం బుద్ధి రావడం లేదు.