Urfi Javed says that the reason for doing the bold show is allergy
Urfi Javed : బాలీవుడ్ టెలివిజన్ యాక్ట్రెస్ ఉర్ఫీ జావేద్ నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. హిందీ బిగ్‌బాస్ షో ద్వారా ఫుల్ పాపులారిటీ సంపాదించుకున్న ఈ నటి.. సోషల్ మీడియాలో బోల్డ్ షో చేస్తూ రెచ్చిపోతుంటుంది. అంతేకాదు బహిరంగ ప్రదేశాల్లో కూడా తన ప్రైవేట్ పార్ట్స్ కనిపించేలా డ్రెస్‌లు వేసుకుంటూ మితిమీరిన బోల్డ్‌నెస్ తో.. చూసే వారికీ చిరాకు తెప్పిస్తూ ఉంటుంది. ఈ విషయంపై ఈ భామ తీవ్ర విమర్శలు ఎదురుకుంటుంది.
Urfi Javed : నా ప్రైవేట్ పార్ట్స్ చూపించనంతవరకు నన్ను జైల్లో వెయ్యలేరు కదా.. ఉర్ఫీ జావేద్!
తాజాగా ఈ విమర్శలకి బదులిచ్చింది ఉర్ఫీ జావేద్. తాను పొట్టి బట్టలు వేసుకోడానికి కారణం తనకున్న అరుదైన వ్యాధే కారణం అంటుంది ఈ బోల్డ్ బ్యూటీ. తన శరీరాన్ని పూర్తిగా కప్పుకుంటూ బట్టలు వేసుకుంటే.. స్కిన్ అలర్జీ వస్తుంది. తన శరీరానికి బట్టలు అంటే అలర్జీ. ఇది చాలా సీరియస్ ప్రాబ్లమ్. దాని వాళ్ళ నా బాడీ మొత్తం ర్యాషెస్, దద్దుర్లు వస్తాయి అంటూ తన శరీరంపై వచ్చిన అలర్జీని చూపిస్తూ ఒక వీడియో చేసింది. ఆ వీడియోని సోషల్ మీడియా ద్వారా షేర్ చేసింది.
కాగా ఇటీవల ఈ అమ్మడి దుబాయ్ వెళ్ళింది. అక్కడ కూడా బోల్డ్ షో చేస్తుండడంతో.. దుబాయ్ పోలీసులు ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చారు. ఇండియాలో కూడా ఆమె పై పలువురు పోలీస్ కేసులు పెట్టారు. వాటికి కౌంటర్ ఇస్తూ ఈ బోల్డ్ భామ.. ‘నా ప్రైవేట్ పార్ట్స్ చూపించనంతవరకు నన్ను జైల్లో వెయ్యలేరు కదా’ అంటూ ప్రైవేట్ పార్ట్స్ కనబడకుండా స్కిన్ షో చేస్తూ కౌంటర్ ఇస్తుంది.