Urvashi Rautela: అమ్మబాబోయ్.. ఒక్క డ్రెస్ ఖరీదు రూ.1500 కోట్లా? కాన్స్‌లో దేవకన్యలా మెరిసిన ఊర్వశి
కాన్స్ ఫస్ట్ లో రూ.1500 కోట్ల డ్రెస్ ధరించి వైరల్ అవుతున్న ఊర్వశి రౌతేలా(Urvashi Rautela).
- V Santhosh Kumar
- Published on- May 14, 2026 / 07:48 PM IST
Urvashi Rautela 1500 Crore Dress at Cannes Film Festival
- కాన్స్‌లో ఊర్వశి రేంజ్ షాక్.
- రూ.1500 కోట్ల డ్రెస్ వైరల్.
- నెట్టింట దేవకన్యలా మెరిసిన నటి.
Urvashi Rautela: ఫ్రాన్స్‌లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా జరుగుతోన్న కాన్స్ చిత్రోత్సవంలో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ తారలు సందడి చేస్తున్నారు. మంగళవారం ప్రారంభమైన ఈ వేడుకలు ఈ నెల 23వ తేదీ వరకు కొనసాగనున్నాయి. ఈ అంతర్జాతీయ వేదికపై భారతీయ నటీమణులు తమ ప్రత్యేకమైన వస్త్రధారణ, శైలితో అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. ఇప్పటికే బాలీవుడ్ స్టార్ నటి అలియా భట్ రెడ్ కార్పెట్‌పై మెరిసి అభిమానులను అలరించింది.
ఈ చిత్రోత్సవంలో మరో భారతీయ నటి ఊర్వశీ రౌతేలా ధరించిన క్రిస్టల్ గౌను ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. వియత్నాంకు చెందిన ప్రముఖ ఫ్యాషన్ లేబుల్ ‘జోలీ పొలీ కోచర్’ ఈ దుస్తులను అద్భుతంగా డిజైన్ చేసింది. వెండి ఎంబ్రాయిడరీ, మెరిసే క్రిస్టల్స్, పూసల వర్క్‌తో రూపొందించిన ఈ సిల్వర్ కలర్ ఫ్రాక్‌తో పాటు ఆమె ధరించిన చోకర్ నెక్లెస్, భారీ ఇయర్ రింగ్స్, పక్షి ఆకారంలోని కేశాలంకరణ ఆభరణం ఆమెకు దేవకన్య లాంటి రూపాన్ని ఇచ్చాయి.
ఫ్యాషన్ నిపుణుల అంచనా ప్రకారం ఊర్వశి ధరించిన ఈ గౌను, ఆభరణాలు, క్లచ్ బ్యాగు మొత్తం విలువ దాదాపు 155.87 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో సుమారు రూ.1500 కోట్లు). ఈ అరుదైన డిజైన్‌ను సిద్ధం చేయడానికి నిపుణులకు దాదాపు 8 నెలల సమయం పట్టింది. ఊర్వశీ రౌతేలా కెరీర్‌లోనే కాన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఆమె ధరించిన అత్యంత ఖరీదైన, విలాసవంతమైన దుస్తులు ఇవే కావడం విశేషం. ప్రస్తుతం ఈ డ్రెస్ నెట్టింట వైరల్ అవుతోంది.
