Ram Gopal Varma: కోట్లు పెట్టినా గ్యారంటీ లేదు.. మొత్తం కాపీ కంటెంట్.. సినిమా మేకింగ్ పై వర్మ షాకింగ్ కామెంట్స్
మూవీ మేకింగ్ పై షాకింగ్ కామెంట్స్ చేసిన రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma).
Ram Gopal Varma Shocking Comments on Tollywood Filmmaking
- సినిమా అంటే మేనేజ్మెంట్, క్రియేటివిటీ
- ఇతరులను అనుకరించడం వల్లే ప్లాప్స్
- స్టార్ల ఇమేజ్ ఆధారంగానే బిజినెస్.
Ram Gopal Varma: సినిమా అంటే కేవలం రంగుల ప్రపంచం, వందల కోట్ల వసూళ్లు మాత్రమే కాదు, అది ఒక పక్కా మేనేజ్మెంట్, క్రియేటివిటీ కలయిక అని వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (Ram Gopal Varma)చెప్పుకొచ్చారు. ఆర్జీవీ అంటే వివాదాలు మాత్రమే గుర్తొచ్చినా, ఆయన సినిమా మేకింగ్ స్టైల్ వెనుక అద్భుతమైన స్పష్టత ఉంటుంది. అనవసరమైన ఆడంబరాలకు పోయి డబ్బు వృధా చేయడం కంటే, కథకు ఎంత కావాలో అంత ఖర్చు పెట్టడమే అసలైన సినిమా మేకింగ్ అని ఆయన నమ్ముతారు. మేకింగ్‌లో సహజత్వం, నిజాయితీ లేకపోతే ప్రేక్షకులు ఖచ్చితంగా రిజెక్ట్ చేస్తారని స్పష్టం చేశారు.
Deepika Pilli: ట్రెండీ లుక్ లో దీపికా పిల్లి ధగధగలు.. క్రేజీ ఫోటోషూట్‌తో ఇంటర్నెట్ షేక్.. ఫొటోలు
మారుతున్న మార్కెట్ లెక్కలపై మాట్లాడుతూ.. ఒకప్పుడు లక్షల్లో తీసిన సినిమాలు కోట్లు కొల్లగొట్టేవని, కానీ ఇప్పుడు వందల కోట్లు పెట్టినా గ్యారెంటీ లేని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. కొత్తగా వచ్చే ఫిల్మ్ మేకర్స్ తమ స్వంత కథలను నమ్మకుండా, ఇతరులను అనుకరించడం వల్లే విఫలమవుతున్నారని ఆర్జీవీ విశ్లేషించారు. అలాగే ప్రస్తుత ట్రెండ్ అయిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) సినిమా రంగంపై చూపుతున్న ప్రభావంపై స్పందిస్తూ.. AI అనేది కేవలం డేటా ఆధారంగా పనిచేస్తుందని, కానీ సినిమా అనేది ఒక మానసిక అనుభూతి అని అభిప్రాయపడ్డారు.
ఇక ప్రభాస్ వంటి పాన్ ఇండియా స్టార్లు దేశంలోనే అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకోవడం వెనుక ఉన్న మార్కెట్ లాజిక్‌ను ఆయన పూర్తిగా సమర్థించారు. సినిమా అనేది ఒక ప్రయోగం మాత్రమే కాదని, అది ఒక విజిబిలిటీ ఉన్న వ్యాపారమని ఆర్జీవీ పేర్కొన్నారు. స్టార్ల ఇమేజ్ ఆధారంగానే బిజినెస్ జరుగుతుందని, దానిని సరిగ్గా హ్యాండిల్ చేసినప్పుడే బాక్సాఫీస్ వద్ద అద్భుతాలు జరుగుతాయని ఆయన తనదైన శైలిలో వివరించారు.
