Aishwarya – Urvashi : కాన్స్‌ రెడ్ కార్పెట్ పై ఐశ్వర్య, ఊర్వశి సందడి.. ట్రోల్ చేస్తున్న నెటిజెన్లు!

కాన్స్‌ రెడ్ కార్పెట్ పై ప్రత్యేక డిజైనర్స్ తో రెడీ చేయించుకున్న డ్రెస్‌లతో మెరిసిన ఐశ్వర్యరాయ్‌, ఊర్వశి రౌటేలా.. నెటిజెన్స్ నుంచి ట్రోలింగ్ కి గురవుతున్నారు.

Urvashi Rautela and Aishwarya Rai trolled by netizens oh their dressing in Cannes

Urvashi Rautela – Aishwarya Rai : ఫ్రాన్స్(France) లో ప్రతి ఏడాది జరిగే కాన్స్ ఫిలిం ఫెస్టివల్ (Cannes Film Festival) కి ప్రపంచంలోని అనేకమంది నటీనటులు, టెక్నీషియన్స్ హాజరయ్యి సందడి చేసే విషయం గురించి అందరికి తెలిసిందే. ఈ ఫెస్టివల్ లో రెడ్ కార్పెట్ తమ అందాలను కనబరిచేందుకు ప్రపంచంలోని అందాల భామలంతా ఎదురు చూస్తుంటారు. తాజాగా ఈ సంవత్సరం 76వ కాన్స్ ఫిలిం ఫెస్టివల్ ఘనంగా ప్రారంభమైంది. మే 16 నుంచి 27 వరకు ఈ ఫెస్టివల్ గ్రాండ్ గా జరగనుంది. ఈ ఫెస్టివల్ కు మన ఇండియా(India) నుంచి కూడా చాలా మంది వెళ్తుంటారు.

Rajinikanth : రజినీకాంత్‌కి అదే చివరి సినిమా.. తమిళ దర్శకుడు సంచలన కామెంట్స్!

ఈ క్రమంలోనే ఐశ్వర్యరాయ్‌, ఊర్వశి రౌటేలా, అనుష్కా శర్మ, మృణాల్ ఠాకూర్, సన్నీ లియోన్, గునీత్ మోంగా, అనురాగ్ కశ్యప్, మరికొంతమంది టెక్నీషియన్స్ పాల్గొంటున్నారు. ఇక ప్రత్యేక డిజైనర్స్ తో రెడీ చేయించుకున్న డ్రెస్‌లతో ఈ అందాల భామలు రెడ్ కార్పెట్ అదిరిపోయే ఫోజులు ఇస్తున్నారు. ఈసారి ఫెస్టివల్ లో ఐశ్వర్యరాయ్‌ వెండి గౌన్‌లో తళుకుమనిపించింది. వెండితో డిజైన్ చేసిన హుడిలో ఐశ్వర్య హోయలు చుసిన కొందరు నెటిజెన్స్.. ఫ్యాషన్‌ను మరోస్థాయికి తీసికెల్లిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. కానీ కొందరు నెటిజన్స్ మాత్రం ఆ డ్రెస్ ని ట్రోల్స్‌ చేస్తున్నారు. డిజైనర్‌ను మార్చండి, వెండి హుడీ ఏంటి విచిత్రంగా అంటూ ట్రోల్ చేస్తున్నారు.

Shah Rukh Khan : ఆర్యన్ ఖాన్‌ను అరెస్టు చేసిన అధికారి.. షారుఖ్ ఖాన్ నుంచి లంచం తీసుకున్నాడు!

అలాగే ఇదే ఫెస్టివల్ ఊర్వశి రౌతేలా విచిత్రమైన నెక్లెస్‌ని ధరించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ముసలి (Crocodile) రూపంలో ఉన్న నెక్లెస్‌ని ధరించింది. అలాగే చెవులకు కూడా అటువంటి రింగ్స్ నే పెట్టుకుంది, ఇక అవి చూసిన నెటిజెన్స్.. ‘ఆ నెక్లెస్‌ ని ఎక్కడ కింద పాడేసుకుంటారేమో జాగ్రత్త. సడన్ గా చూసి మొసలి అనుకొని భయపడతారు’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.