Urvashi Rautela Dance: టాలీవుడ్‌లో ఈ జెనరేషన్ యంగ్ హీరోల్లో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ డ్యాన్సింగ్ స్టైల్‌కి చాలా మంది అభిమానులున్నారు. మనోడు వేసే స్టైలిష్ స్టెప్స్‌కి కేరళలో సైతం ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఫ్యాన్స్ బన్నీ వీడియోలకు డ్యాన్స్ చేసి ఆ వీడియోలను సోషల్ మీడియాలో షేర్ చేయడం చూస్తూనే ఉన్నాం.
అయితే తాజాగా ఓ హీరోయిన్ తనకు తానే ‘లేడి అల్లు అర్జున్’ అని బిరుదు ఇచ్చేసుకుంది. ఎవరా హీరోయిన్ ఏంటా కథ అంటే.. బాలీవుడ్ బ్యూటీ, మిస్ యూనివర్స్ ఊర్వశీ రౌతేలా తెలుగులో సంపత్ నంది కథనందిస్తున్న ‘బ్లాక్ రోజ్’ సినిమాలో నటిస్తుంది.
ఈ సినిమా సాంగ్ ప్రాక్టీస్‌కు సంబంధించిన వీడియో షేర్ చేస్తూ.. నేను లేడి అల్లు అర్జున్‌లా డ్యాన్స్ చేస్తున్నప్పుడు(అల్లు అర్జున్ నాకు స్ఫూర్తి).. నా కొత్త చిత్రం ‘బ్లాక్ రోజ్’ నుంచి సౌత్ ఇండియన్ డ్యాన్స్ స్టైల్‌ను మీకు పరిచయం చేస్తున్నా’.. అని కామెంట్ చేసింది.
‘నా తప్పు ఏమున్నదబ్బా’ అంటూ సాగే ఈ పాట డ్యాన్స్ ప్రాక్టీస్ వీడియోలో రెండు చేతులు ఫ్లోర్ మీద ఉంచి ఊర్వశి చేసిన మూమెంట్ అదిరిపోయింది. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
When i act like lady @alluarjun (my inspiration) #AlluArjun ?. Presenting you my South Indian Dance Style for my film #BlackRose ?!!!!#love #UrvashiRautela #Dance pic.twitter.com/CprMSM57Gr
— URVASHI RAUTELA?? (@UrvashiRautela) September 27, 2020