Walter Veeraiah: “వాల్తేరు వీరయ్య”తో ఊర్వశి ఐటమ్ సాంగ్..
టాలీవుడ్ గాడ్ ఫాదర్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం "వాల్తేరు వీరయ్య". ఫ్యాన్ బాయ్ బాబీ తన అభిమాన హీరోని మాస్ మూలవిరాట్ అవతారంలో చూపించబోతున్నాడు. ఇటీవల దీపావళి కానుకగా విడుదలయిన టీజర్ సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో చెప్పేసింది. తాజాగా ఈ సినిమా నుంచి మరో క్రేజీ అప్డేట్ బయటకి వచ్చేసింది. అదేంటంటే...
- gum 95921
- Published On : November 4, 2022 / 11:39 AM IST
Urvashi's item song with Walter Veeraiah
Walter Veeraiah: టాలీవుడ్ గాడ్ ఫాదర్ చిరంజీవి నటిస్తున్న తాజా చిత్రం “వాల్తేరు వీరయ్య”. ఫ్యాన్ బాయ్ బాబీ తన అభిమాన హీరోని మాస్ మూలవిరాట్ అవతారంలో చూపించబోతున్నాడు. ఇటీవల దీపావళి కానుకగా విడుదలయిన టీజర్ సినిమా ఏ రేంజ్ లో ఉండబోతుందో చెప్పేసింది. ఒక్కప్పటి వింటేజ్ చిరుని మళ్ళీ ఈ మూవీలో చూడబోతున్నాము అని తెలుస్తుంది.
Chiranjeevi: చిరంజీవితో భేటీ అయిన బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్..
తాజాగా ఈ సినిమా నుంచి మరో క్రేజీ అప్డేట్ బయటకి వచ్చేసింది. అదేంటంటే ఈ మూవీలో ఐటమ్ సాంగ్ కోసం బాలీవుడ్ బ్యూటీ ‘ఊర్వశి రౌటెలా’ని రంగంలోకి దించుతున్నారు అంట మూవీ టీం. ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే దేవి ఐటమ్ నంబర్స్ కి టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉంది.
అటువంటిది దేవి మాస్ బీట్స్ కి.. మాస్ విరాట్ తో కలిసి మిస్ యూనివర్స్ స్టెప్పులు వేస్తుంటే థియేటర్లు మోత మోగిపోవడం ఖాయం అంటున్నారు అభిమానులు. అయితే ఈ వార్తపై ఎటువంటి అధికారిక ప్రకటన లేదు. కాగా ఈ బ్యూటీ రామ్ పోతినేని, బోయపాటి దర్శకత్వంలో ఐటమ్ సాంగ్ చేయబోతున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.
