Vadivelu: వడివేలు షాకింగ్ రియాక్షన్.. శంకర్ వద్దు.. ఆయన స్నేహమే వద్దు!
ప్రముఖ తమిళ హాస్యనటుడు వడివేలు.. సౌత్ ఇండియా సినీ దర్శక దిగ్గజం శంకర్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు. మళ్లీ శంకర్ సినిమాలలో తనకు నట్టించే ఉద్దేశం లేదన్న వడివేలు..
- Naresh Mannam
- Published On : September 12, 2021 / 12:00 PM IST
Vadivelu
Vadivelu: ప్రముఖ తమిళ హాస్యనటుడు వడివేలు.. సౌత్ ఇండియా సినీ దర్శక దిగ్గజం శంకర్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు. మళ్లీ శంకర్ సినిమాలలో తనకు నట్టించే ఉద్దేశం లేదన్న వడివేలు.. ఆయన వద్దు.. ఆయన స్నేహమే వద్దు అనేలా మాట్లాడారు. చాలాకాలంగా సినిమాలకి దూరంగా ఉన్న వడివేలు శంకర్ పై చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు దక్షణాది సినీ పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారాయి. నిజానికి వడివేలును తమిళ చిత్ర పరిశ్రమ బహిష్కరించింది. గతంలో శంకర్ తో వివాదాలతో పాటు ఆయనపై మరికొన్ని వివాదాలు కూడా ఉన్నాయి.
Big Boss 5: బయటపడిన కాజల్ బండారం.. సరయు బూతులకు గ్రీన్ సిగ్నల్
ఒకదశలో దక్షణాది సినీ సీమలో టాప్ కమెడియన్ గా ఓ వెలుగు వెలిగిన వడివేలు సూపర్ స్టార్ రజనీతో కూడా విభేధాలున్నాయని కోలీవుడ్ మీడియాలో కథనాలు సంచలనమయ్యాయి. దర్శకనిర్మాత శంకర్.. దర్శకుడు చింబు దేవన్ వడివేలుపై తమిళ్ ఫిల్మ్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కేసు దాఖలు చేశారు. ఇంసై అసరన్ 23 ఆమ్- పులకేసి-2 చిత్రాలకు సంబంధించి ఈ వివాదం జరిగినట్లు అప్పుడు నడిచిన టాక్. ఈ సినిమాలను వడివేలు షూటింగ్ మధ్యలోనే ఆపేసి వెళ్లిపోవడంతో శంకర్ 4 కోట్ల నష్టాన్ని డిమాండ్ చేసారు. ఆ తర్వాత లైకా ప్రొడక్షన్స్ జోక్యం చేసుకుని వీరి మధ్య సమస్యలను పరిష్కరించే ప్రయత్నం చేసింది.
Drugs Case: ఈడీ విచారణకు నవదీప్.. ఎఫ్ క్లబ్ పార్టీలపై అధికారుల ఫోకస్!
అక్కడ సీన్ కట్ చేస్తే.. ఇప్పుడు మళ్ళీ సినిమాలలో బిజీగా మారాలని ప్రయత్నిస్తున్న వడివేలు చెన్నైలో విలేకర్ల సమావేశంలో మాట్లాడాడు. ‘అందరూ నా పనైపోయిందని, తెరపై కనిపించడని అనుకుంటున్నారు. వారందరికీ నా సమాధానం ‘నాకు ఎండ్ కార్డే లేదురా’. ఇటీవల సీఎం స్టాలిన్‌ను కలిసొచ్చిన తర్వాత జీవితంలో చాలా మార్పులొచ్చాయని.. సమస్యలన్నీ తొలగిపోయి సినిమాల్లో నటిస్తున్నానని’ పేర్కొన్నారు. వెండితెరపై తన హాస్య కెరీర్ మళ్లీ మొదలైందని పేర్కొనగా.. చాలా గ్యాప్ తర్వాత ప్రస్తుతం ఆయన సురాజ్ దర్శకత్వంలోని ‘నాయ్ శేఖర్’ చిత్రంలో నటిస్తున్నారు.
