Manchu Lakshmi : సెట్లో వింత జంతువులు.. ‘రాకా’ అప్డేట్ ఇచ్చిన మంచు లక్ష్మి..
నటి మంచు లక్ష్మి నేను ముంబైలో రాకా సెట్ కి వెళ్ళాను అంటూ పలు విషయాలు చెప్తూ ఓ వీడియోని తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసింది. (Manchu Lakshmi)
Manchu Lakshmi
Manchu Lakshmi : అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో రాకా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. భారీ బడ్జెట్ తో హాలీవుడ్ లెవల్ లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ తో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అల్లు అర్జున్ ఇందులో కొత్తగా కనిపించబోతున్నాడని తెలుస్తుంది.
తాజాగా నటి మంచు లక్ష్మి నేను ముంబైలో రాకా సెట్ కి వెళ్ళాను అంటూ పలు విషయాలు చెప్తూ ఓ వీడియోని తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసింది.
మంచు లక్ష్మి రాకా గురించి మాట్లాడుతూ.. బన్నీ బాంబేలో షూటింగ్ చేస్తున్నాడు. ఎన్నో రోజుల నుంచి పిలుస్తున్నాడు రమ్మని. కానీ నాకు కుదర్లేదు. ఇవాళ వెళ్ళాను. నేను ఇప్పుడే రాకా సినిమా సెట్ కి వెళ్లి వస్తున్నాను. ఆ సెట్ చూసి ఆశ్చర్యంతో నోరు కూడా మూసుకోలేకపోయాను. నేను ఇంతకు ముందెన్నడూ చూడని వింతలు చూసాను. ఎన్నో రకాల కొత్త జీవరాశులు అక్కడ ఉన్నాయి. అలంటి జంతువులను గానీ, బన్నీ లాంటి మనుషులను గానీ, ఇన్ని విభాగాలతో ఉన్న ఇలాంటి సెట్ ని గానీ నేను ఎప్పుడూ చూడలేదు. నాకు పిచ్చెక్కిపోయింది. అద్భుతం. ఈ సినిమా కోసం నేను ఆగలేకపోతున్నాను. ఎన్నో విషయాలు పంచుకోవాలని ఉంది కానీ పంచుకోలేకపోతున్నాను అని తెలిపింది.
మంచు లక్ష్మి వ్యాఖ్యలతో బన్నీ రాకా సినిమాపై మరిన్ని అంచనాలు నెలకొన్నాయి.
Also See : Bigg Boss Soniya : భర్త, కూతురుతో కలిసి బిగ్ బాస్ సోనియా వరలక్ష్మి వ్రతం.. ఫొటోలు..
I visited the #Raaka movie set just now. I couldn’t even close my mouth! There were so many different types of species I had never seen before. I haven’t seen animals like this or people like Bunny or sets like this with so many departments. It’s just WOW i can’t wait for this… pic.twitter.com/boBPKZ7vO1
— Sumanth (@SumanthOffl) August 22, 2026
