Valimai: ఓటీటీలో వలిమై రికార్డ్.. 24 గంటల్లో 100 మిలియన్ మినిట్స్ స్ట్రీమింగ్!
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ ఫస్ట్ టైమ్ పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేసిన సినిమా ‘వలిమై’. హిందీ, తమిళ్, తెలుగు..
- Naresh Mannam
- Published on- March 27, 2022 / 07:15 AM IST
Valimai
Valimai: కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ ఫస్ట్ టైమ్ పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ చేసిన సినిమా ‘వలిమై’. హిందీ, తమిళ్, తెలుగు, కన్నడ భాషల్లో వరల్డ్ వైడ్ గా ఫిబ్రవరి 24న రిలీజైన వలిమై సినిమా మిక్సెడ్ టాక్ తెచ్చుకున్నా.. నాలుగు రోజుల్లోనే రూ.100 కోట్ల వసూళ్లను రాబట్టి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. కరోనా తర్వాత వందకోట్లు కొల్లగొట్టిన తొలి తమిళ్ సినిమాగా కోలీవుడ్ కు బూస్టప్ ఇచ్చింది వలిమై.
Valimai: రూ.100 కోట్ల క్లబ్‌లో వలిమై.. ఆల్ టైమ్ రికార్డులను సెట్ చేస్తున్న అజిత్
తమిళంలో మినహా మిగతా బాషలలో వలిమై ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. అయినా.. వసూళ్ల పరంగా వలిమై రికార్డులను నెలకొల్పింది. ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులను అలరించిన వలిమై ఈ నెల 25 నుంచి ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫామ్ జీ5లో స్ట్రీమింగ్ మొదలైంది. ఇక ఇప్పుడు ఓటీటీలో కూడా రికార్డులను నమోదు చేస్తుంది.
Valimai: ప్రోమోకు పెయిడ్ లైక్స్.. నెట్టింట యాంటీ ఫాన్స్ దుమారం!
ఓటీటీలో స్ట్రీమింగ్ మొదలైన తొలి 24 గంటల్లోనే వలిమై 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్‌ని పూర్తి చేసుకుని మరో రికార్ నెలకొల్పింది. జీ5లో ఇది బిగ్గెస్ట్ ఓపెనింగ్ అని తెలుస్తుంది. అజిత్ నటించిన 60వ సినిమా ఇది కాగా.. టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ ఈ సినిమాతో కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చి నెగటివ్ రోల్ లో నటించాడు. బాలీవుడ్ భామ హ్యూమా ఖురేషి ఫీమేల్ లీడ్ చేయడం మరో అట్రాక్షన్ కాగా.. పక్కా యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా స్టైలిష్ అండ్ ఇంటిలిజెంట్ యాక్షన్ మూవీగా ప్రేక్షకులను అట్రాక్ట్ చేస్తుంది.
