తన మూడో పెళ్లిపై కామెంట్ చేసిన నటికి స్ట్రాంగ్ రిప్లై ఇచ్చిన వనిత

  • Publish Date - June 30, 2020 / 02:43 PM IST

సీనియర్ నటులు మంజుల, విజయ్ కుమార్ దంపతుల పెద్ద కూతురు వనిత విజయ్ కుమార్ జూన్ 27న పీటర్ పాల్‌ను వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇది ఆమెకు మూడో పెళ్లి కావడంతో మీడియా బాగా ఫోకస్ చేసింది. ఇక పీటర్ విషయానికొస్తే అతనికిది రెండో పెళ్లి. తనకు విడాకులు ఇవ్వకుండానే తన భర్త మరో పెళ్లి చేసుకున్నాడని పీటర్ మొదటి భార్య ఎలిజబెత్ హెలెన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇదిలా ఉంటే తన పెళ్లి గురించి ట్వీట్ చేసిన నటి లక్ష్మీ రామకృష్ణన్‌పై తన స్టైల్లో రెచ్చిపోయింది వనితా విజయ్ కుమార్.. అసలు ఇంతకీ లక్ష్మీ ఏం ట్వీట్ చేసింది.. వనిత ఎలా రియాక్ట్ అయింది అనేది ఓ సారి చూద్దాం.

వనిత పెళ్లి వార్త తెలియగానే లక్ష్మీ రామకృష్ణన్.. ‘ఇప్పుడే ఈ వార్త చూశాను. ఇప్పటికే వివాహం చేసుకుని ఇద్దరు పిల్లలకు తండ్రైన వ్యక్తిని, మొదటి భార్యకు విడాకులు ఇవ్వని వ్యక్తిని ఎలా వివాహం చేసుకున్నారు. బాగా చదువుకున్న, సెలబ్రిటీ అయిన వారు ఇలాంటి పెద్ద తప్పు ఎలా చేశారు. అయినా పెళ్లి జరిగిపోయే వరకు పీటర్ మొదటి భార్య ఎందుకు ఆగారు? ముందే ఎందుకు ఆపలేదు’ అంటూ ట్విట్టర్‌ ద్వారా ప్రశ్నించారు. ఈ ట్వీట్‌పై స్పందించిన వనిత.. ‘ఇద్దరు మనషులు ఎందుకు విడిపోతారో, ఎందుకు విడాకులు తీసుకుంటారో నీకు తెలుసా? ఈ విషయంతో నీకెలాంటి సంబంధమూ లేదు. కాబట్టి నువ్వు ఇందులో వేలు పెట్టడం మంచిది కాదు. నేను వేరెవరి వ్యక్తిగత జీవితాల్లోనూ తలదూర్చడం లేదు. కాబట్టి దయచేసి నీ పని నువ్వు చూసుకుంటే మంచిది’ అంటూ వనిత స్ట్రాంగ్ రిప్లై ఇచ్చింది.

దీనికి కొనసాగింపుగా వనిత మరికొన్ని ట్వీట్స్ చేయడంతో.. చట్టపరంగా విడాకులు ఇవ్వకుండా ఇంకో పెళ్లి చేసుకోవడం అనే అంశం గురించి నా అభిప్రాయం చెప్పాను తప్ప ఎవర్నీ కించ పరిచే ఉద్దేశం తనకు లేదని, ఇప్పటికే ట్వీట్ డిలీట్ చేశానని, ఈ విషయాన్ని ఇక్కడితో వదిలెయ్, ఏదైనా ఉంటే లీగల్‌గా తేల్చుకుందాం అంటూ లక్ష్మీ రామకృష్ణన్‌ వివరణ ఇవ్వడంతో వనిత ట్వీట్స్ చేయడం ఆపేసింది.

Read:టాలీవుడ్‌పై కరోనా ఎఫెక్ట్: బడ్జెట్, రెమ్యునరేషన్లు తగ్గించుకోక తప్పదు..