Varaha Roopam song was removed from Kantara streaming in amazon prime
Kantara : హోంబేలె ఫిలిమ్స్ నిర్మాణంలో కన్నడ దర్శకుడు రిషబ్ శెట్టి నటిస్తూ, తెరకెక్కించిన డివోషనల్ కాన్సెప్ట్ మూవీ ‘కాంతార’. సప్తమి గౌడ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 30న కన్నడలో విడుదలై అఖండమైన విజయాన్ని అందుకుంది. ఆ తరువాత తెలుగు, హిందీ వంటి ఇతర భాషల్లో కూడా అనువదించి ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చారు మూవీ మేకర్స్.
Kantara : ఓటిటిలో కాంతార సందడి మొదలైపోయింది..
కర్ణాటకలోని ఒక ప్రాంతపు గ్రామదేవతల కథాంశంతో వచ్చిన ఈ రీజినల్ సినిమా.. పాన్ ఇండియా లెవెల్ లో అందర్నీ ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా ఓటిటి విడుదల కోసం దేశవ్యాప్తంగా ఉన్న సినీప్రియులు ఎదురుచూస్తున్నా సమయంలో.. నిన్న అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల చేసి సర్‌ప్రైజ్ చేశారు. కాగా సినిమాకే ప్లస్ పాయింట్ గా నిలిచిన ‘వరాహ రూపం’ సాంగ్ ని ప్రైమ్ వీడియోస్ సినిమా నుంచి తొలిగించింది.
నిన్న రాత్రి విడుదల చేసిన సమయంలో ఆ పాటని ఉంచినప్పటికీ, నేడు సినిమాలోని ఆ పాటను తొలిగించింది. కారణం కేరళకు చెందిన ప్రముఖ సంగీత బృందం తైక్కుడం బ్రిడ్జ్ “కాంతారా” నిర్మాతలు తమ “నవరసం” పాటను “వరాహ రూపం” పేరుతో దొంగిలించారని గతంలో ఆరోపించింది. సినిమా, యూట్యూబ్ మరియు ఇతర స్ట్రీమింగ్ సైట్‌ల నుండి ఆ పాటను తొలగించాలని కోరుతూ వారు కోర్టును కూడా ఆశ్రయించారు.
దీంతో ఆ నిబంధనలు ప్రకారం అమెజాన్ ప్రైమ్ వీడియోస్ కూడా తొలగించింది. అయితే అభిమానులు మాత్రం, ఆ పాట లేకపోవడంతో నిరాశ వ్యక్తం చేస్తున్నారు.