Varalakshmi Sarathkumar : హనుమాన్‌లో ‘అంజమ్మ’గా వరలక్ష్మి శరత్‌కుమార్.. అదిరిపోయిన ఫస్ట్ లుక్
హీరోయిన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా ఇలా అన్ని రకాల పాత్రలతో తెలుగు, తమిళ భాషల్లో మెప్పిస్తున్న వరలక్ష్మి శరత్ కుమార్ 'హనుమాన్' సినిమాలో అంజమ్మగా కనిపించనుంది...........
- Saketh U
- Published on- March 4, 2022 / 03:02 PM IST
Hanuman
Hanuman : యంగ్ హీరో తేజ సజ్జ, హీరోయిన్ అమృత అయ్యర్ జంటగా ట్యాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రాబోతున్న సినిమా ‘హనుమాన్’. ఇండియన్ ఫస్ట్ సూపర్ హీరో సినిమా అంటూ ‘హనుమాన్’ని ప్రమోట్ చేస్తున్నారు. ఈ సినిమాపై కూడా భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి హీరో, హీరోయిన్స్ ఫస్ట్ లుక్స్ రిలీజ్ చేశారు. తాజాగా ఈ సినిమాలో అంజమ్మ క్యారెక్టర్ పోస్టర్ని రిలీజ్ చేశారు.
హీరోయిన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా ఇలా అన్ని రకాల పాత్రలతో తెలుగు, తమిళ భాషల్లో మెప్పిస్తున్న వరలక్ష్మి శరత్ కుమార్ ‘హనుమాన్’ సినిమాలో అంజమ్మగా కనిపించనుంది. అంజమ్మ ఫస్ట్ లుక్ ని కన్నడ స్టార్ హీరో కిచ్చ సుదీప్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్లో పెళ్లికూతురిగా ముస్తాబైన వరలక్ష్మి చేతిలో కొబ్బరి బోండాల గుత్తితో ఉంది. ఆ కొబ్బరి బోండాలని పట్టుకొని విలన్లను కొడుతూ ఆవేశంగా ఉన్నట్టు కనిపిస్తుంది. చాలా కొత్తగా ఉండటంతో ఈ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
Nithya Menon : ‘భీమ్లానాయక్’ టీంపై హర్ట్ అయిన నిత్యామీనన్.. ప్రమోషన్స్‌లో అందుకే పాల్గొనలేదా??
‘హనుమాన్’ సినిమాని పాన్ ఇండియా వైడ్‌గా తెలుగు, తమిళ్, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ చేయనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది. ఈ సంవత్సరం చివర్లో ‘హనుమాన్’ని రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
