Nithya Menon : ‘భీమ్లానాయక్’ టీంపై హర్ట్ అయిన నిత్యామీనన్.. ప్రమోషన్స్‌లో అందుకే పాల్గొనలేదా??

సినిమా ప్రమోషన్స్ లో కాని ఆ తర్వాత సక్సెస్ మీట్ లో కాని నిత్యా మీనన్ పాల్గొనలేదు. ఇందుకు ముఖ్య కారణం సినిమాలో నిత్యా సన్నివేశాలని తొలిగించారని తెలుస్తుంది. సంయుక్త మీనన్...........

Nithya Menon : ‘భీమ్లానాయక్’ టీంపై హర్ట్ అయిన నిత్యామీనన్.. ప్రమోషన్స్‌లో అందుకే పాల్గొనలేదా??

Nitya

Nithya Menon :  పవన్‌ కల్యాణ్‌, రానా కలిసి నటించిన బిగ్గెస్ట్ మల్టీస్టారర్ సినిమా ‘భీమ్లా నాయక్‌’. త్రివిక్రమ్ రాసిన మాటలకి సాగర్ చంద్ర దర్శకత్వం వహించగా ఈ సినిమా ఫిబ్రవరి 25న రిలీజ్ అయింది. మొదటి రోజు నుంచే ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకొని భారీ విజయం సాధించింది. కలెక్షన్స్ కూడా భారీగా వస్తున్నాయి. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ భార్యగా నిత్యా మీనన్ నటించగా, రానా భార్యగా సంయుక్త మీనన్ నటించింది.

అయితే సినిమా ప్రమోషన్స్ లో కాని ఆ తర్వాత సక్సెస్ మీట్ లో కాని నిత్యా మీనన్ పాల్గొనలేదు. ఇందుకు ముఖ్య కారణం సినిమాలో నిత్యా సన్నివేశాలని తొలిగించారని తెలుస్తుంది. సంయుక్త మీనన్ సన్నివేశాలని కూడా కొన్నిటిని తొలిగించారట. ఈ సినిమా రిలీజ్ అవ్వకముందు భీమ్లా నాయక్ నుంచి వచ్చిన పాటల్లో ‘అంత ఇష్టం ఏందయ్యా..’ ఒకటి. ఈ పాట బాగా వైరల్ అయింది. మాస్ సినిమాలో ఇదొక మెలోడీ ప్రేమ గీతంలా అందరికి నచ్చింది. అయితే సినిమా రిలీజ్ తర్వాత చూస్తే సినిమాలో ఈ సాంగ్ లేదు. దీంతో చాలా మంది ఈ పాట అభిమానులు నిరాశ చెందారు.

Project K: ప్రభాస్ సినిమా కోసం ఆనంద్ మహీంద్రా సాయం!

ఈ పాట మొత్తం నిత్యా మీనన్ వైపు నుంచే వినిపిస్తుంది. దీంట్లో నిత్యా మీనన్ కి అత్యంత ప్రాధాన్యత ఉంది. అయితే ఈ పాటతో పాటు నిత్యామీనన్ కి సంబంధించిన క్లైమాక్స్ లో కొన్ని సన్నివేశాలని తొలిగించారు చిత్ర బృందం. దీనిపై నిత్య అసహనం వ్యక్తం చేసిందట. ఈ విషయంలో నిత్య హర్ట్ అయిందట కూడా. అందుకే నిత్యా ఈ సినిమాకి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్, వేరే ఏ ఈవెంట్ లోను పాల్గొనలేదు అని తెలుస్తుంది.

Jr NTR: చిల్ అవుతున్న తారక్.. వర్రీ అవుతున్న ఫ్యాన్స్!

అయితే ప్రస్తుతం నిత్యా ఆహా ఓటీటీలో వచ్చే ‘తెలుగు ఇండియన్ ఐడల్’లో జడ్జిగా వ్యవహరిస్తోంది. ఈ షో షూటింగ్స్ లో బిజీగా ఉండటం వల్ల ఆ ఈవెంట్స్ కి రాలేకపోయిందని కొంతమంది అంటున్నారు. కానీ ఒక ఈవెంట్ కి కాకపోయినా ఇంకో ఈవెంట్ కి అయినా, లేదా ఏదో ఒక ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొనాలి కదా, మరీ అంత బిజినా అని అడుగుతున్నారు అభిమానులు, నెటిజన్లు. ఏది నిజమో, నిత్యా ఎందుకు రాలేదో తనకే తెలియాలి మరి. ఏదైతే ఏముంది ప్రేక్షకులు మాత్రం ఒక మంచి సాంగ్ ని చూడటం మిస్ అయ్యారు.