Jr NTR: చిల్ అవుతున్న తారక్.. వర్రీ అవుతున్న ఫ్యాన్స్!

బిందాస్ గా చిల్ అవుతున్నారు తారక్. మిగిలిన హీరోలు సినిమాలు, సినిమా షూటింగ్స్ అంటూ హడావిడీ చేస్తుంటే ఎన్టీఆర్ మాత్రం ఇంకా రిలాక్స్ మోడ్ లోనే కనిపిస్తున్నారు. అయితే ట్రిపుల్ ఆర్..

Jr NTR: చిల్ అవుతున్న తారక్.. వర్రీ అవుతున్న ఫ్యాన్స్!

Jr Ntr

Jr NTR: బిందాస్ గా చిల్ అవుతున్నారు తారక్. మిగిలిన హీరోలు సినిమాలు, సినిమా షూటింగ్స్ అంటూ హడావిడీ చేస్తుంటే ఎన్టీఆర్ మాత్రం ఇంకా రిలాక్స్ మోడ్ లోనే కనిపిస్తున్నారు. అయితే ట్రిపుల్ ఆర్ కోసం మూడన్నరేళ్లు స్పెండ్ చేసిన తారక్ ఫ్యూచర్ పై ఫ్యాన్స్ మాత్రం వర్రీ అవుతున్నారు. నెక్స్ ప్రాజెక్ట్స్ అప్ డేట్స్ చెప్పన్నా అనే పోస్ట్ లతో సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు.

ప్రభాస్ తర్వాత ఆ స్థాయిలో పాన్ ఇండియా అవతార్ అవుదామనుకున్నారు తారక్. ట్రిపుల్ ఆర్ సినిమా ఇచ్చే గ్రేస్ తో ఇండియా వైడ్ రచ్చ చేయొచ్చని కళలు కన్నారు. ఊహించినట్టే సినిమా రిలీజ్ కు ముందే సౌత్ టు నార్త్ అంత క్రేజ్ దక్కించుకున్నారు ఎన్టీఆర్. ఆర్ఆర్ఆర్ ప్రమోషన్స్ లోనే చరణ్, తారక్ లున్న స్టార్ ఇమేజ్ ఏంటో తెలిసిపోయింది. కానీ నెక్ట్స్ సినిమాలపై చరణ్ చూపిస్తున్న పట్టును యంగ్ టైగర్ మిస్ చేసుకుంటున్నారు. కొరటాల శివతో సినిమా ఉంటుందని ప్రకటించినా అది ఇంతవరకు సెట్స్ పైకెళ్లకపోవడం ఫ్యాన్స్ ను డిస్సప్పాయింట్ చేస్తోంది.

బాహుబలి తర్వాత ప్రభాస్ లా పాన్ ఇండియా ఇమేజ్ వస్తే వంద కోట్లకు రెమ్యునరేషన్ పెరగొచ్చు. కానీ ట్రిపుల్ ఆర్ ని నమ్ముకున్న ఎన్టీఆర్ కు చాలా కాలం కరిగిపోయింది. కనీసం ఈ టైమ్ లో 4, 5 సినిమాలు చేసినా 200 కోట్ల వరకు వెనకేసుకునేవారు. అటు చూస్తే ఆచార్య పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ లో కొరటాల బిజీగా మారారు. ఏప్రిల్ 29న ఆచార్య థియేటర్ కొచ్చేవరకు కొరటాల, తారక్ సినిమా పట్టాలెక్కదు. మేలోనే వీళ్లిద్దరూ కలిసి సెట్స్ పైకెళ్లారు. ఈలోపు ట్రిపుల్ ఆర్ రిలీజై.. స్టామినా చూపిస్తే తారక్ కొత్త సినిమాలేవైనా ప్రకటించే ఛాన్స్ ఉంది.

ఆర్ఆర్ఆర్ సినిమాతో తారక్ ఇమేజ్ ఎలాంటి టర్న్ తీసుకుంటుందో ముందు ముందు తెలుస్తోంది. ఇన్నాళ్లు ఓపిక పట్టినందుకు అనుకున్నది సాధిస్తే.. తారక్ ఫ్యాన్స్ కన్నా సంతోషించే వాళ్లు ఎవరు ఉండరు. కానీ ఆర్ఆర్ఆర్ తర్వాత చేయబోయే సినిమా ఎలా వుండాలన్నదానిపై క్లారిటీ మిస్ అవుతుంది తారక్ కి. కొరటాల ఆ తర్వాత ప్రశాంత్ నీల్ లైన్ లో ఉన్నారు కానీ గ్యాప్ ఎక్కువగా కనిపిస్తోంది. హ్యూజ్ మార్కెట్ ఉన్న తారక్ లాంటి హీరో ఇంతేసి గ్యాప్ ఇవ్వడం కరెక్ట్ కాదు. మళ్లీ ఇలా జరగకుండా చూసుకుంటే బెటర్ అనేది ఫ్యాన్స్ వర్షన్.