Varalaxmi Sarathkumar
Varalaxmi Sarathkumar: తమిళ సీనియర్ హీరో శరత్ కుమార్ కూతురు, నటి వరలక్ష్మి శరత్ కుమార్ ఈ ఏడాది అల్లరి నరేష్ హీరోగా నటించిన ‘నాంది’, రవితేజ కామ్‌బ్యాక్ చిత్రం ‘క్రాక్’ సినిమాతో మంచి సక్సెస్ అందుకుంది. ముఖ్యంగా క్రాక్ సినిమాలో వరలక్ష్మి జయమ్మ పాత్ర ఆమెకి చాలా పేరు తెచ్చిపెట్టింది. ప్రస్తుతం వరలక్ష్మి దక్షణాది అన్ని బాషలలో వరుస ప్రాజెక్టులలో నటిస్తూ బిజీగా ఉంది. కాగా, తాజాగా తన తండ్రి శరత్ కుమార్‌తో కలిసి ఆమె బచ్చన్ కుటుంబాన్ని కలుసుకుంది.
ఈ కలయిక వెనుక కారణాలేమీ చెప్పలేదు కానీ.. బచ్చన్ కుటుంబంతో గడపడంపై జయమ్మ తన ఆనందాన్ని సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేసింది. ఎంతో మర్యాదస్తులైన వ్యక్తులను కలిశాను అంటూ వరలక్ష్మి.. అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యారాయ్, ఆరాధ్యలతో కలిసిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అంత ఎత్తు ఎదిగినా బచ్చన్ ఫ్యామిలీ తమను ఎంతో మర్యాదగా చూసుకున్నారని వరలక్ష్మి సంబరంగా రాసుకుంది.
‘తమ కుటుంబం విషయం పక్కన పెడితే.. వాళ్లలో ఉన్న సంస్కారం.. మర్యాద భావం చాలా అద్భుతం. వాళ్ల ప్రేమకి నేను ఎంతో పొంగిపోయాను. ఇలాంట వ్యక్తులను కలుసుకోవడం ఎంతో సంతోషంగా ఉంది. ఇది సాధ్యమయ్యేలా చేసిన మా నాన్న శరత్‌కుమార్‌కి ప్రత్యేకంగా ధన్యవాదాలు’ అంటూ వరలక్ష్మి ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. ఇక దీనికి సంబంధించిన పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.