Varalaxmi Sarathkumar : పాన్ ఇండియా లేడీ ఓరియెంటెడ్ సినిమాతో రాబోతున్న వరలక్ష్మి శరత్ కుమార్..

తాజాగా వరలక్ష్మి శరత్ కుమార్ ఓ తెలుగు డైరెక్టర్ తో పాన్ ఇండియా సినిమా ఓకే చేసినట్టు సమాచారం.

Varalaxmi Sarathkumar New Movie with Director Megoti Sanjeev

Varalaxmi Sarathkumar : వరలక్ష్మి శరత్ కుమార్ ప్రస్తుతం సౌత్ లో అన్ని భాషల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, నెగిటివ్ రోల్స్ లో దూసుకుపోతుంది. వరుస విజయాలతో భారీ సినిమాలతో బిజీగా ఉంది. ఇటీవలే 12 ఏళ్ళ క్రితం విశాల్ సరసన నటించిన మదగజరాజ సినిమా సంక్రాంతికి తమిళ్ లో రిలీజయి హిట్ కొట్టింది. ఇప్పుడు ఆ సినిమా తెలుగులో జనవరి 30న రిలీజ్ కానుంది. తాజాగా వరలక్ష్మి శరత్ కుమార్ ఓ తెలుగు డైరెక్టర్ తో పాన్ ఇండియా సినిమా ఓకే చేసినట్టు సమాచారం.

Also Read : Chiranjeevi : తల్లి బర్త్ డేని సెలబ్రేట్ చేసిన చిరంజీవి.. వీడియో తీసిన చరణ్.. ఇంతకంటే ఏం కావలి అంటూ చిరంజీవి తల్లి ఎమోషనల్..

దండు, రాఘవరెడ్డి, మంచు లక్ష్మితో ఆదిపర్వం.. లాంటి సినిమాలు తీసిన డైరెక్టర్ సంజీవ్ మేగోటి ఇటీవల వరలక్ష్మి శరత్ కుమార్ కి సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ కథ చెప్పడంతో ఆమె ఓకే చేసింది. ఇందులో వ‌ర‌లక్ష్మి శరత్ కుమార్ మెయిన్ లీడ్ చేయ‌నుంది. ఇప్పటికే వరలక్ష్మి మెయిన్ లీడ్ లో పలు సినిమాలు చేసింది. ఇది లేడీ ఓరియెంటెడ్ సినిమా అని సమాచారం. మరి ఈ సారి సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ కథతో ఏ రేంజ్ లో మెప్పిస్తుందో చూడాలి. త్వరలోనే ఈ సినిమా వివరాలు అధికారికంగా ప్రకటించనున్నారు.