Chiranjeevi : తల్లి బర్త్ డేని సెలబ్రేట్ చేసిన చిరంజీవి.. వీడియో తీసిన చరణ్.. ఇంతకంటే ఏం కావలి అంటూ చిరంజీవి తల్లి ఎమోషనల్..
నేడు చిరంజీవి తల్లి అంజనమ్మ పుట్టిన రోజు కావడంతో తన ఇంట్లో చేసిన సెలబ్రేషన్స్ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసారు.

Megastar Chiranjeevi Shares his Mother Birthday Celebrations Video Watch Here
Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ప్రతి సంవత్సరం తన తల్లి పుట్టిన రోజుని గ్రాండ్ గా సెలబ్రేట్ చేస్తారని తెలిసిందే. ఇంట్లో వాళ్లంతా ఒకచోట చేరి చిరంజీవి తల్లి అంజనమ్మ పుట్టిన రోజు వేడుకలను ఘనంగా చేస్తారు. ఆ సెలబ్రేషన్స్ ని చిరంజీవి తన సోషల్ మీడియాలో షేర్ చేస్తారు. నేడు తల్లి అంజనమ్మ పుట్టిన రోజు కావడంతో తన ఇంట్లో చేసిన సెలబ్రేషన్స్ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసారు మెగాస్టార్.
ఈ వీడియోలో చిరంజీవి తల్లి వస్తుంటే పూల వర్షం కురిపించారు. లోపలి వచ్చాక కేక్ కట్ చేయించారు. చిరంజీవితో పాటు చరణ్, ఉపాసన, మెగా ఫ్యామిలీలోని కొంతమంది వచ్చి అంజనమ్మకు కేక్ తినిపించి విషెష్ చెప్పారు. చివర్లో అంజనమ్మ.. చాలా బాగుంది నాన్న. మీ అందరూ ఉంటే నాకు ఇంకేం కావలి. మీ అందర్నీ చూస్తుంటే సంతోషంగా ఉంటుంది అంటూ ఎమోషనల్ అయి చెప్పింది.
ఈ వీడియోని చిరంజీవి తన సోషల్ మీడియాలో షేర్ చేసి.. అమ్మా.. ఈ స్పెషల్ రోజున మేము నిన్ను మాటల్లో చెప్పలేనంత ప్రేమిస్తున్నామని, నువ్వు ఊహించిన దానికంటే ఎక్కువ గౌరవిస్తున్నామని తెలుసుకోవాలని కోరుకుంటున్నాను. మా అమ్మకు పుట్టిన రోజు శుభాకాంక్షలు. మా ఫ్యామిలీకి హార్ట్ లాంటిది, మా అందరికి బలం, స్వచ్ఛమైన ప్రేమకు నిదర్శనం. నీ పాదాలకి నమస్కరిస్తూ పుణ్యం చేసుకొన్న నీ సంతతి అంటూ పోస్ట్ చేసారు. మీరు కూడా ఆ వీడియో చూసేయండి..
ఇక ఈ వీడియోలో చరణ్ కూడా ఉన్నాడు. చరణే వీడియో తీసాడు. దీంతో మెగా ఫ్యాన్స్ ఈ వీడియోని తెగ వైరల్ చేస్తూ చిరంజీవి తల్లి అంజనమ్మకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక చిరంజీవి విశ్వంభర సినిమాతో బిజీగా ఉండగా, రామ్ చరణ్ RC16 సినిమాతో బిజీగా ఉన్నాడు. పలువురు మెగా ఫ్యామిలీ మెంబర్స్ కూడా అంజనా దేవికి పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్తూ పోస్టులు చేసారు.