Ibrahim Ali Khan : ఇటీవలే సైఫ్ అలీ ఖాన్ పై అటాక్.. ఓ పక్క కేసు నడుస్తుంటే.. సైఫ్ కొడుకుని హీరోగా ప్రకటించిన కరణ్ జోహార్..

బాలీవుడ్ అగ్ర దర్శక నిర్మాత కరణ్ జోహార్ సైఫ్ అలీ ఖాన్ కొడుకు ఇబ్రహీం అలీ ఖాన్ ని హీరోగా తమ నిర్మాణ సంస్థ ద్వారా పరిచయం చేయబోతున్నాము అంటూ ప్రకటించాడు.

Ibrahim Ali Khan : ఇటీవలే సైఫ్ అలీ ఖాన్ పై అటాక్.. ఓ పక్క కేసు నడుస్తుంటే.. సైఫ్ కొడుకుని హీరోగా ప్రకటించిన కరణ్ జోహార్..

Karan Johar Introducing Saif Ali Khan Son Ibrahim Ali Khan as Hero under his Production

Updated On : January 29, 2025 / 6:34 PM IST

Ibrahim Ali Khan : ఇటీవల సైఫ్ అలీ ఖాన్ పై దొంగతనానికి వచ్చిన దుండగుడు కత్తితో దాడి చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం సైఫ్ హాస్పిటల్లో సర్జరీల అనంతరం ఇంట్లోనే రెస్ట్ తీసుకుంటున్నాడు. పోలీసులు ఇప్పటికే ఆ నిందితుడిని అరెస్ట్ చేయగా ప్రస్తుతం ఈ కేసులో విచారణ చేస్తున్నారు. అయితే సైఫ్ అలీ ఖాన్ ఇలా దాడికి గురయి ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్న సమయంలో అతని కొడుకు ఇబ్రహీం అలీఖాన్ ని హీరోగా ప్రకటించారు.

సైఫ్ అలీ ఖాన్ మొదటి భార్య నటి అమృత సింగ్ కు పుట్టిన అబ్బాయి ఇబ్రహీం అలీ ఖాన్. ఇప్పటికే ఈ జంట కూతురు సారా అలీఖాన్ హీరోయిన్ గా వరుస సినిమాలు చేస్తుంది. గత కొన్నేళ్లుగా ఇబ్రహీం కూడా హీరోగా ఏంట్రీ ఇస్తాడని వార్తలు వస్తున్నాయి. తాజాగా నేడు బాలీవుడ్ అగ్ర దర్శక నిర్మాత కరణ్ జోహార్ ఇబ్రహీం అలీ ఖాన్ ని హీరోగా తమ నిర్మాణ సంస్థ ద్వారా పరిచయం చేయబోతున్నాము అంటూ ప్రకటించాడు. బాలీవుడ్ లో ఆల్మోస్ట్ ఏ స్టార్ పిల్లలు అయినా కరణ్ జోహార్ చేతుల మీదుగా లాంచ్ అవ్వాల్సిందే. ఇప్పుడు ఇబ్రహీం అలీ ఖాన్ కూడా కరణ్ జోహార్ చేతుల మీదుగా హీరోగా లాంచ్ కాబోతున్నాడు.

Also See : శివ కార్తికేయన్ ‘పరాశక్తి’ టైటిల్ టీజర్ చూశారా? శ్రీలీల ఎంట్రీ అదిరిందిగా..

కరణ్ జోహార్ ఇబ్రహీం అలీ ఖాన్ ఫోటోలు షేర్ చేసి.. నేను అమృత గారిని నా 12 ఏళ్ళ వయసులో కలిసాను. అప్పుడు ఆమె మా నిర్మాణ సంస్థలో సినిమా చేస్తుంది. నేను ఆమెతో మొదటిసారి కలిసి కూర్చొని తిన్న సంగతి నాకు గుర్తుంది. తను నన్ను రెండో కొడుకుగా ట్రీట్ చేసింది. సైఫ్ ని ఆనంద్ మహేంద్ర ఆఫీస్ లో మొదటిసారి కలిసాను. అందంగా, చార్మింగ్ ఉన్న యువకుడు అప్పుడు. మొదటిసారి ఇబ్రహీంని కలిసినప్పుడు అలాగే అనిపించింది. మా మధ్య మంచి స్నేహం ఉంది. ఈ కుటుంబం నాకు 40 ఏళ్లుగా తెలుసు. వారితో కలిసి ఎన్నో సినిమాలకు పనిచేసాను. సారా అలీఖాన్ తో కూడా పనిచేసాను. ఆ కుటుంబం గురించి నాకు తెలుసు. సినిమాలు వాళ్ళ రక్తంలోనే ఉన్నాయి. ఇప్పుడు కొత్త ట్యాలెంట్ రాబోతుంది వాళ్ళ కుటుంబం నుంచి. ఇబ్రహీం అలీ ఖాన్ త్వరలో మీ హృదయాల్లోకి, తెరపైకి వస్తాడు వేచి చూడండి అంటూ తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసాడు.

Also Read : Anil Ravipudi – Venkatesh : సంక్రాంతికి వస్తున్నాం హిట్ కాంబో.. అనిల్ రావిపూడి – వెంకటేష్ ఫస్ట్ కలిసి పనిచేసిన సినిమా ఫ్లాప్ అని తెలుసా..?

ఇలా కరణ్ జోహార్ ఇబ్రహీం తల్లి తండ్రులు సైఫ్ – అమృతాలతో ఉన్న అనుబంధాన్ని పంచుకుంటూ ఇబ్రహీంని హీరోగా పరిచయం చేస్తున్నాను అని ప్రకటించడంతో సైఫ్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. పలువురు అభిమానులు, నెటిజన్లు, సెలబ్రిటీలు ఇబ్రహీం అలీ ఖాన్ కు కంగ్రాట్స్ తెలుపుతున్నారు. సారా అలీ ఖాన్ కూడా కరణ్ పోస్ట్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ తమ్ముడికి సినిమాల్లోకి వెల్కమ్ చెప్పింది. పలువురు మాత్రం మరో నేపో కిడ్ వస్తున్నాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అయితే సైఫ్ అలీ ఖాన్ దాడికి గురయి ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్న సమయంలో అతని కొడుకు ఇబ్రహీంను హీరోగా ప్రకటించడంతో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇబ్రహీం ఎలాంటి సినిమాతో వస్తాడో, సైఫ్ లెగసీని ఎలా ముందుకు తీసుకెళ్తాడో చూడాలి.