Varalaxmi Sarathkumar Nicholai Sachdev Engagement Video goes Viral
Varalaxmi Sarathkumar – Nicholai Sachdev : సౌత్ లో లేడీ విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీగా ఉన్న నటి వరలక్ష్మి శరత్ కుమార్. ఇన్నాళ్లు పెళ్లి చేసుకోను అంటూ వచ్చిన వరలక్ష్మి ఇటీవల ప్రేమించి ఓ అబ్బాయిని నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. మూడు రోజుల క్రితం వరలక్ష్మి శరత్ కుమార్ ముంబైకి చెందిన పెయింట్ ఆర్టిస్ట్ నికోలయ్ సచ్‌దేవ్ ని నిశ్చితార్థం చేసుకుంది.
Also Read : Gopichand : గోపీచంద్ ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ.. ‘భీమా’.. పోలీస్ కమర్షియల్ కథతో పాటు ఫాంటసీ ఎలిమెంట్స్ కూడా..
కేవలం వీళ్లిద్దరి ఫ్యామిలీలు మాత్రమే ఈ వేడుకలో పాల్గొన్నాయి. ఆల్రెడీ నిశ్చితార్థం జరిగిన రోజే ఫోటోలు రిలీజ్ చేయగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా నేడు వరలక్ష్మి శరత్ కుమార్ – నికోలయ్ సచ్‌దేవ్ నిశ్చితార్థం వీడియో హైలెట్స్ ని రిలీజ్ చేశారు. అయితే ఈ వీడియోలో వరలక్ష్మి – నికోలయ్ లిప్ కిస్‌లతో హంగామా చేశారు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది.