Varalxmi Sarath Kumar learned Bike Driving and welcome more women to ride bikes Varalxmi Sarath Kumar learned Bike Driving and welcome more women to ride bikes
Bike Driving : శరత్ కుమార్(Sarath Kumar) కూతురిగా తమిళ్(Tamil) లో హీరోయిన్(Heroine) గా ఎంట్రీ ఇచ్చింది వరలక్ష్మి శరత్ కుమార్(Varalxmi Sarath Kumar). ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్, లేడీ విలన్ గా, వుమెన్ ఓరియెంటెడ్ సినిమాలు కూడా చేస్తూ వస్తుంది. ప్రస్తుతం వరుస సినిమాలతో, రకరకాల పాత్రలతో తెలుగు, తమిళ్, మలయాళ సినిమా పరిశ్రమలలో బిజీగా ఉంది వరలక్ష్మి శరత్ కుమార్. తాజాగా వరలక్ష్మి శరత్ కుమార్ ఓ ఆసక్తికర వీడియోని షేర్ చేసి ఇంట్రెస్టింగ్ మ్యాటర్ పోస్ట్ చేసింది.
వరలక్ష్మి శరత్ కుమార్ సైకిల్, స్కూటీ, బైక్ నేర్చుకొని ఆ వీడియోని పోస్ట్ చేసింది. ఆ వీడియోలో రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ నడిపింది. రాయల్ ఎన్‌ఫీల్డ్ సంస్థ నిర్వహించిన ఎన్‌ఫీల్డ్ రైడర్స్ – వుమెన్ బైక్ కోచింగ్ ప్రోగ్రాంలో వరలక్ష్మి తన స్నేహితులతో పాల్గొని బైక్ నేర్చుకుంది.
#Mentoo : రియలిస్టిక్ ‘#మెన్ టూ’ సినిమా ఆహాలోకి వచ్చేస్తుంది.. ఆ రోజు నుంచే స్ట్రీమింగ్..
ఈ వీడియోని షేర్ చేస్తూ.. ఇప్పటికి లేట్ ఏం అవ్వలేదు. చిన్నప్పట్నుంచి బైక్ అమ్మాయి నడపకూడదు అని భయం పెట్టారు. కానీ నేను నడపాలనుకున్నాను. ఇప్పుడు నేర్చుకొని బైక్ నడుపుతున్నాను. వారం రోజులుగా సైకిల్, స్కూటీ, బైక్ నేర్చుకున్నాను. మొదట్లో కొంచెం భయపడ్డాను. కానీ నేను అనుకున్నంత లేదు. ఇప్పటికి మించిపోయిందేమి లేదు. అమ్మాయిలు భయం వదిలేసి రండి, బైక్ నేర్చుకోండి. మాకు డ్రైవింగ్ నేర్పించిన రాయల్ ఎన్‌ఫీల్డ్స్ సంస్థకు ధన్యవాదాలు. నేను, నా స్నేహితులు, మరికొంతమంది అమ్మాయిలు.. మేము పడ్డాము, భయపడ్డాము, నేర్చుకున్నాము అని పోస్ట్ చేసింది. దీంతో వరలక్ష్మి బైక్ డ్రైవింగ్ చేసిన వీడియో వైరల్ గా మారింది.