Varanasi movie makers planning a Latin song in Natu Natu style
Varanasi: ఆర్.ఆర్.ఆర్ సినిమాలో ‘నాటు నాటు’ పాట ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మాస్ బీట్స్ తో వచ్చిన ఈ పాట ప్రపంచాన్నే షేక్ చేసింది అని చెప్పాలి. ఎంతలా అంటే, ఏకంగా ఆస్కార్ అవార్డ్ వరించింది ఈ సాంగ్. అంతేలా జనాదరణ పొందింది ఈ పాట. ఇప్పుడు అదే తరహాలో హై-ఎనర్జీ, అదిరిపోయే స్టెప్పులతో కూడిన ఒక భారీ సాంగ్ ను ‘వారణాసి’ సినిమాలో సెట్ చేస్తున్నాడట రాజమౌళి.
దీనికి, సంబందించిన ఒక న్యూస్ ఇండస్ట్రీ వర్గాల హాట్ టాపిక్ గా మారింది. అయితే, ఈ పాట కేవలం మాస్ బీట్‌కే పరిమితం కాకుండా, అంతర్జాతీయ లాటిన్ మ్యూజికల్ స్టైల్లో కంపోజ్ చేయనున్నాడట కీరవాణి. ఇండియా మ్యూజిక్ లో ఇంతవరకు మనం విన్న రొటీన్ ఇన్స్ట్రుమెంట్స్ కాకుండా.. ఈ పాట కోసం వాడిన మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్, రిథమ్ చాలా ప్రత్యేకంగా ఉంటాయట. అందుకోసం లాటిన్ అమెరికన్ సంగీతంలో ఉండే పెర్కషన్స్, గిటార్ నోట్స్ ను మన ఊర మాస్ బీట్‌ను కలిపి ఒక సరికొత్త ‘ఫ్యూజన్’ను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది.
Manchu Lakshmi: పుష్పను ఫేమస్ చేసింది నేనే.. ఆ డైలాగ్ నాదే.. మంచు లక్ష్మి షాకింగ్ కామెంట్స్
ఇక ‘నాటు నాటు’ సాంగ్ లో ఎన్టీఆర్, చరణ్ చేసిన సింక్ డ్యాన్స్ లాగే, ఈ పాటలో కూడా హీరో చేసే డ్యాన్స్ మూమెంట్స్ థియేటర్లలో ప్రేక్షకులను సీట్ల నుంచి లేచి డాన్స్ చేసేలా చేస్తాయని సమాచారం. ఇక సరికొత్త పంథాలో ఉండే ఈ సాంగ్ కోసం ఇంటర్నేషనల్ లెవల్లో గుర్తింపు పొందిన కొరియోగ్రాఫర్లు పనిచేస్తున్నారట. అత్యున్నత సాంకేతిక విలువలతో, భారీ సెట్లలో ఈ పాట మేకింగ్ జరుగుతుందట. ఈ సాంగ్ కోసం మేకర్స్ దాదాపు రూ.30 కోట్ల వరకు ఖర్చు చేస్తున్నారని సమాచారం.
‘నాటు నాటు’ సాంగ్ ఎలాగైతే భాషతో సంబంధం లేకుండా ప్రపంచాన్ని ఊపేసిందో, ఈ వారణాసి సాంగ్ కూడా గ్లోబల్ ఆడియన్స్‌ను ఆకట్టుకునేలా ప్లాన్ చేస్తున్నాడట జక్కన్న. లాటిన్ స్టైల్ డాన్స్ ఫామ్స్ సల్సా, రేగ్గాయేటోన్ లాంటివి ఇండియన్ స్టైల్‌తో మిక్స్ అవ్వడం వల్ల ఈ పాట సోషల్ మీడియా రీల్స్‌లో ట్రెండ్ కావడం ఖాయం. మరి ఇన్ని ప్రత్యేకతల మధ్య తెరకెక్కుతున్న ఈ పాట నాటు నాటు క్రియేట్ చేసినంత సెన్సేషన్ ను రిక్రియెట్ చేస్తుందా అనేది చూడాలి. ఇక వారణాసి సినిమా 2027 ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది.