Varshini Sounderajan : హైపర్ ఆదితో పెళ్లి రూమర్స్.. స్పందించిన యాంకర్..
హైపర్ ఆది, వర్షిణి కలిసి గతంలో కొన్ని షోలలో కనిపించారు. అయితే గత కొంతకాలంగా వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు అని వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ రూమర్స్ పై వర్షిణి స్పందించింది.
- Saketh U
- Published On : August 14, 2023 / 11:27 AM IST
Varshini Sounderajan gives clarity on marriage with Hyper Aadi
Varshini Sounderajan : జబర్దస్త్(Jabardastyh) తో మంచి కమెడియన్ గా, రైటర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు హైపర్ ఆది(Hyper Aadi). ప్రస్తుతం పలు టీవీ షోలు, సినిమాలతో బిజీగా ఉన్నాడు ఆది. అయితే ఇటీవల హైపర్ ఆది పెళ్లిపై రూమర్స్ వచ్చాయి. యాంకర్, నటి వర్షిణిని హైపర్ ఆది పెళ్లి చేసుకోబోతున్నాడని రూమర్స్ వచ్చాయి. షార్ట్ ఫిలిమ్స్ తో మొదలుపెట్టిన వర్షిణి ఆ తర్వాత యాంకర్ గా, నటిగా మంచి పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం పలు సినిమాలు, షోలతో బిజీగానే ఉంది వర్షిణి.
హైపర్ ఆది, వర్షిణి కలిసి గతంలో కొన్ని షోలలో కనిపించారు. అయితే గత కొంతకాలంగా వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారు అని వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ రూమర్స్ పై వర్షిణి స్పందించింది. నిన్న ఆదివారం కావడంతో తన ఇన్‌స్టాగ్రామ్ లో అభిమానులతో చిట్ చాట్ నిర్వహించింది. అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు వర్షిణి తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరిలలో సమాధానం ఇచ్చింది. అయితే ఎక్కువమంది నెటిజన్లు వర్షిణిని నీ పెళ్లి ఎప్పుడు? హైపర్ ఆదితో నీ పెళ్లి ఎప్పుడు అని అడిగారు.
Nick Jonas : పబ్లిక్ ఈవెంట్లో ప్రియాంక చోప్రా భర్తపై లో దుస్తులు విసిరిన ఆడియన్స్..
దీంతో దీనిపై వర్షిణి స్పందిస్తూ.. చాలా మంది దీని గురించి అడుగుతున్నారు. అసలు ఇది ఎవరో మొదలుపెట్టారో తెలీదు. దీనిపై స్పందించకూడదు అనుకున్నాను కానీ దీని గురించి అతన్ని కూడా అడుగుతున్నారంట. మీరు అడిగేదాంట్లో అసలు ఏ మాత్రం నిజం లేదు. అవన్నీ అబద్ధం వార్తలు అని తెలిపింది. ఇక మరో నెటిజన్ నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగితే మా అమ్మని అడుగు అని చెప్పింది. మొత్తానికి హైపర్ ఆది – వర్షిణి మధ్య ఎలాంటి రిలేషన్ షిప్ లేదని క్లారిటీ ఇచ్చింది ఈ భామ.
