Varudu Kaavalenu : ‘పొగరుబోతులకే కనుక ప్రీమియర్ లీగ్ ఉంటే’..

ఆకట్టుకునే డైలాగులతో.. ఆడియన్స్‌ను అలరిస్తుంది ‘వరుడు కావలెను’ థియేట్రికల్ ట్రైలర్..

Varudu Kaavalenu: యంగ్ హీరో నాగశౌర్య, రీతు వర్మ జంటగా.. లక్ష్మీ సౌజన్యను దర్శకురాలిగా పరిచయం చేస్తూ.. పిడివి ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై యంగ్ అండ్ ప్యాషనేట్ ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఫ్యామిలీ అండ్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్.. ‘వరుడు కావలెను’..

Varudu Kaavalenu : ‘ఆ అందం.. ఆ పొగరు.. ఆర్డర్ ఇచ్చి చేయించినట్టు ఉంటుంది’..

అచ్చ తెలుగు టైటిల్ కావడంతో సినిమాపై ముందు నుండి మంచి అంచనాలున్నాయి. అలాగే ఇప్పటివరకు రిలీజ్ చేసిన పాటలు, ప్రోమోలకు కూడా వెరీగుడ్ రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా ‘దిగు దిగు నాగ’ సాంగ్ చార్ట్ బస్టర్‌గా నిలిచింది. ఈమధ్య రిలీజ్ చేసిన టీజర్ సినిమా మీద అంచనాలు పెంచేసింది. ఈ జెనరేషన్ యూత్ లైఫ్ స్టైల్‌కి దగ్గరగా ఉండడమే కాక సినిమా మీద అంచనాలు పెంచేసింది.

 

Folk Songs : ‘సారంగ దరియా’ నుండి ‘దిగు దిగు దిగు నాగ’ వరకు ఊపు ఊపుతున్న ఫోక్ సాంగ్స్..
గురువారం ‘వరుడు కావలెను’ థియేట్రికల్ ట్రైలర్ హ్యాండ్సమ్ హీరో రానా దగ్గుబాటి చేతుల మీదుగా విడుదలైంది. ట్రెలర్ చూసినవాళ్లంతా సినిమా పక్కా హిట్ అని చెప్తున్నారు. నాగ శౌర్య – రీతు వర్మ పెయిర్.. వారి కెమిస్ట్రీ ప్రేక్షకులకు కొత్తగా అనిపించింది. ట్రైలర్‌లో క్లుప్తంగా కథ చెప్పేసినా కూడా సినిమా మీద మరింత హైప్ క్రియేట్ అయ్యింది. ముఖ్యంగా డైలాగ్స్ చాలా బాగా ఆకట్టుకుంటున్నాయి. డైలాగ్ రైటర్ గణేష్ అందమైన మాటలు రాశారు.

Rana Daggubati : రానా రేంజ్ పెరిగింది.. అందుకే అన్ని కోట్లు..

‘‘పొగరుబోతులకే కనుక ప్రీమియర్ లీగ్ ఉంటే.. ప్రతీ సీజన్‌లో ఆవిడే విన్నర్ తెలుసా.. నీ పెళ్లెప్పుడు చేస్తారని అడుగుతుంటే సమాధానం చెప్పలేక పెళ్లిళ్లకి వెళ్లడమే మానేశానే.. నా పేరు తెలుసా.. ఆకాష్.. భూమికి అన్నివైపులా నేనే ఉంటాను.. ఒకసారి చదివేసిన పుస్తకాన్ని మళ్లీ చదివితే కథ మారుతుందా.. లేక ముగింపు మారుతుందా.. మారుతుందని ఆశపడడం పిచ్చితనం.. మారిందని భ్రమ పడడం మూర్ఖత్వం..’’ లాంటి డైలాగ్స్ చాలా బాగా అలరిస్తున్నాయి.. అక్టోబర్ 29న సినిమా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది. నదియా, మురళీ శర్మ, వెన్నెల కిషోర్, ప్రవీణ్, హర్ష వర్థన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు.

ట్రెండింగ్ వార్తలు