David Dhawan : ఇకపై తండ్రిగానే.. రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ డైరెక్టర్.. మన సినిమాలన్ని కాపీ కొట్టి స్టార్‌డమ్..
తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు. (David Dhawan)
- Saketh U
- Updated on- April 24, 2026 / 03:22 PM IST
David Dhawan
David Dhawan : తాజాగా బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ డేవిడ్ ధావన్ తన రిటైర్మెంట్ గురించి మాట్లాడారు. 74 ఏళ్ళ ఈ డైరెక్టర్ 1989 నుంచి బాలీవుడ్ లో సినిమాలు చేస్తున్నాడు. ఎన్నో సూపర్ హిట్ సినిమాలు అందించారు. అందులో 70 శాతం సౌత్ సినిమాల రీమేక్ లు, మన సినిమాల సీన్స్ కాపీ కొట్టి రాసుకున్న సినిమాలే కావడం గమనార్హం. డైరెక్టర్ డేవిడ్ ధావన్ బాలీవుడ్ స్టార్ హీరో వరుణ్ ధావన్ కి తండ్రి కూడా.
తన కొడుకు వరుణ్ ధావన్ ని హీరోగా పెట్టి మృణాల్ ఠాకూర్, పూజ హెగ్డే హీరోయిన్స్ గా హై జవానీ తో ఇష్క్ హోనా హై అనే సినిమా చేస్తున్నారు డేవిడ్ ధావన్. ఈ సినిమా మే లో రిలీజ్ అవ్వనుంది. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
Also Read : Ram Charan : మలయాళ నటీనటులతో రామ్ చరణ్.. వాలా 2 టీమ్‌తో చరణ్ సందడి.. ఫోటోలు..
డేవిడ్ ధావన్ మాట్లాడుతూ.. ఇకపై నేను సినిమాలు ఆపేద్దాం అనుకుంటున్నాను. ఇదే నా చివరి సినిమా అవ్వొచ్చు. ఈ సినిమా సమయంలో నాకు కొన్ని ఆరోగ్య సమస్యలు వచ్చాయి. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. ఈ సినిమా తర్వాత కేవలం తండ్రిగానే ఉండాలి అనుకుంటున్నాను. మారుతున్న బాలీవుడ్ పరిస్థితులు కూడా సినిమాలు ఆపేయడానికి ఒక కారణం అని అన్నారు. దీంతో డేవిడ్ ధావన్ రిటైర్మెంట్ వార్తలు బాలీవుడ్ లో చర్చగా మారాయి.
90వ దశకంలో బాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ కమర్షియల్ దర్శకుల్లో ఈయన ఒకరు. మన తెలుగు సినిమాల్లోని అల్లరి మొగుడు, ఆ ఒక్కటి అడక్కు, హలో బ్రదర్, బావగారు బాగున్నారా, కందిరీగ.. సినిమాలను హిందీలో రీమేక్ చేసారు. తమిళ్ సినిమాలు కూడా చాలానే రీమేక్ లు చేసి హిట్స్ కొట్టారు. ఎక్కువ సినిమాలు గోవిందాతో చేసారు. దీంతో హై జవానీ తో ఇష్క్ హోనా హై సినిమా తర్వాత డేవిడ్ ధావన్ సినిమాలకు రిటైర్మెంట్ ఇచ్చేస్తారని తెలుస్తుంది. ఆయనకు ఇద్దరు కొడుకులు. వరుణ్ ధావన్ హీరోగా ఎదగగా, మరో కొడుకు రోహిత్ ధావన్ డైరెక్టర్ గా మారి ఇప్పుడిప్పుడే పేరు తెచ్చుకుంటున్నాడు.
