Varun Sandesh : రియల్ లైఫ్ స్టోరీ ఆధారంగా వరుణ్ సందేశ్ కొత్త సినిమా.. ‘నింద’ పోస్టర్ రిలీజ్..
యదార్థ సంఘటనల ఆధారంగా ఓ కొత్త కాన్సెప్ట్‌తో ‘నింద’ అనే సినిమాని తీసుకు వస్తున్న వరుణ్ సందేశ్.
- gum 95921
- Published On : April 19, 2024 / 08:31 PM IST
Varun Sandesh new crime thriller movie NINDHA poster released
Varun Sandesh : టాలీవుడ్ హీరో వరుణ్ సందేశ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలను సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే రెండు సినిమాలను అనౌన్స్ చేసిన వరుణ్ సందేశ్.. ఇప్పుడు మరో కొత్త సినిమాని అనౌన్స్ చేశారు. యదార్థ సంఘటనల ఆధారంగా ఓ కొత్త కాన్సెప్ట్‌తో ‘నింద’ అనే సినిమాని ఆడియన్స్ ముందుకు తీసుకు రాబోతున్నారు. నేడు ఈ మూవీని అనౌన్స్ చేస్తూ పోస్టర్ ని రిలీజ్ చేశారు.
రాజేష్ జగన్నాథం ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నారు. కాగా రిలీజ్ చేసిన పోస్టర్ లో న్యాయదేవతని చూపిస్తున్నారు. ఇక టైటిల్ కింద కాండ్రకోట మిస్టరీ అనే క్యాప్షన్ ని పెట్టారు. టైటిల్ మరియు పోస్టర్ డిజైన్ చూస్తుంటే.. ఎవరో చేసిన నేరానికి మరొకరు నింద ఎదుర్కోవడం సినిమా మెయిన్ స్టోరీ పాయింటా అనే సందేహం కలుగుతుంది. ది ఫర్వెంట్ ఇండీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై రాజేష్ జగన్నాథమే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Also read : Sunny Leone : తెలుగు మూవీలో మరోసారి సన్నీ లియోన్.. హారర్ కామెడీ ‘మందిర’ ఫస్ట్ లుక్ రిలీజ్..
ఆనీ, తనికెళ్ల భరణి, భద్రం, సూర్య కుమార్, చత్రపతి శేఖర్ తదితరలు ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకి సంబంధించిన మరికొన్ని వివరాలను తెలియజేయనున్నారు.
