Sunny Leone : తెలుగు మూవీలో మరోసారి సన్నీ లియోన్.. హారర్ కామెడీ ‘మందిర’ ఫస్ట్ లుక్ రిలీజ్..

తెలుగు మూవీలో మరోసారి సన్నీ లియోన్ కనిపించబోతున్నారు. హారర్ కామెడీతో 'మందిర'..

Sunny Leone : తెలుగు మూవీలో మరోసారి సన్నీ లియోన్.. హారర్ కామెడీ ‘మందిర’ ఫస్ట్ లుక్ రిలీజ్..

Sunny Leone new telugu horror comedy movie Mandir

Updated On : April 19, 2024 / 8:04 PM IST

Sunny Leone : బాలీవుడ్ హాట్ బ్యూటీ సన్నీ లియోన్.. ‘కరెంటు తీగ’ సినిమాతో తెలుగు ఆడియన్స్ ముందుకు వచ్చారు. ఆ తరువాత ‘పిఎస్‌వి గరుడవేగ’ సినిమాలో ఐటెం సాంగ్ లో మెరిసి అదుర్స్ అనిపించారు. చివరిగా మంచు విష్ణు ‘జిన్నా’ సినిమాలో నటించి అలరించారు. మళ్ళీ ఇప్పుడు మరోసారి తెలుగు ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యారు.

‘మందిర’ అనే హారర్ కామెడీ సినిమాతో సన్నీ లియోన్ త్వరలో తెలుగు ఆడియన్స్ ని పలకరించబోతున్నారు. సన్నీ లియోన్ ఇప్పటివరకు పోషించని పాత్రని ఈ సినిమాలో పోషించబోతున్నారట. ఆర్ యువన్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ లో సన్నీ లియోన్ కిరీటం ధరించి కనిపిస్తున్నారు.

Also read : Mahesh Babu : కామిక్ కాన్ ఈవెంట్‌లో గుంటూరు కారం ఘాటు.. సర్రా సరాసర అంటున్న స్పైడర్ మెన్..

విజన్ మూవీ మేకర్స్ బ్యానర్ పై సాయి సుధాకర్ కొమ్మలపాటి నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుకుంటుంది. త్వరలోనే మూవీ రిలీజ్ డేట్ తో పాటు ఇతర వివరాలను కూడా ప్రకటించనున్నారు.

Sunny Leone new telugu horror comedy movie Mandir