Nindha : ఓటీటీలో ఒక్కరోజే రికార్డ్ వ్యూస్ సాధించిన వరుణ్ సందేశ్ సినిమా..

ప్రస్తుతం నింద సినిమా ఈటీవి విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.

Varun Sandesh Nindha Movie Getting High Views in OTT

Nindha : ఒకప్పుడు హీరోగా వరుస సినిమాలు తీసిన కొంచెం గ్యాప్ తర్వాత ఇటీవల హీరోగా ‘నింద’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ది ఫెర్వెంట్ ఇండీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాజేష్ జగన్నాధం నిర్మిస్తూ, దర్వకత్వం వహించిన నింద సినిమా జూన్ 21న థియేటర్స్ లోకి వచ్చింది. ఈ సినిమా థియేటర్స్ లో పర్వాలేదనిపించింది. నింద సినిమాలో శ్రేయ రాణి, క్యూ మధు, తనికెళ్ళ భరణి, ఛత్రపతి శేఖర్.. పలువురు ముఖ్య పాత్రలు పోషించారు.

Also Read : Vinayaka Chavithi 2024 : సలార్ వినాయకుడు, దేవర వినాయకుడు.. ఈ విగ్రహాలు చూసారా?

ఒక వ్యక్తి తప్పు చేయకపోయినా ఎవరో అతన్ని ఇరికించి శిక్ష పడేలా చేస్తే అతన్ని వరుణ్ సందేశ్ ఎలా కాపాడాడు అనే కథాంశంతో సస్పెన్స్ థ్రిల్లర్ గా నింద సినిమాని తెరకెక్కించారు. థియేటర్స్ లో అలరించిన ఈ సినిమా ఇటీవల సెప్టెంబర్ 6న ఈటీవి విన్ ఓటీటీలోకి వచ్చేసింది. ప్రస్తుతం నింద సినిమా ఈటీవి విన్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. అయితే ఈ సినిమా ఒక్కరోజులోనే ఓటీటీలో రికార్డ్ వ్యూస్ రాబట్టింది.

కేవలం ఒక్క రోజులోనే నింద సినిమా 1.4 మిలియన్‌ స్ట్రీమింగ్‌ మినిట్స్‌ సాధించి అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఓటీటీలో నింద సినిమా దూసుకెళ్తుంది. ఈ క్రమంలో నింద ఓటీటీలో మరింత వ్యూస్ రప్పించేలా ఉంది. ఓటీటీ ప్రేక్షకులని నింద సినిమా మెప్పించింది చెప్పొచ్చు. మీరు కూడా నింద సినిమా చూడకపోతే ఈటీవి విన్ ఓటీటీలో చూసేయండి..

ట్రెండింగ్ వార్తలు