Vinayaka Chavithi 2024 : సలార్ వినాయకుడు, దేవర వినాయకుడు.. ఈ విగ్రహాలు చూసారా?
ఈ సారి ప్రభాస్ సలార్ క్యారెక్టర్ తో వినాయక విగ్రహాన్ని, అలాగే ఎన్టీఆర్ దేవర క్యారెక్టర్ తో విగ్రహాన్ని తయారుచేసారు.

Salaar Vinayaka and Devara Vinayaka Idols goes Viral on Vinayaka Chavithi
Vinayaka Chavithi 2024 : నిన్న ఘనంగా దేశమంతా వినాయక చవితి పండుగను సెలబ్రేట్ చేసుకుంది. వినాయకచవితికి కొత్త కొత్త ఆకారంలో ఉన్న వినాయక విగ్రహాలు తయారుచేస్తారని తెలిసిందే. వినాయక మండపాలు పెట్టేవాళ్ళు కూడా కొత్త కొత్త విగ్రహాలు పెట్టాలనుకుంటారు. ఇటీవల కొంతమంది మన హీరోల సినిమాల్లోని క్యారెక్టర్స్ తో వినాయక విగ్రహాలు తయారుచేస్తున్నారు. గతంలో బాహుబలి వినాయకుడు, పుష్ప వినాయకుడు విగ్రహాలు చూసాము.
Also Read : Chiranjeevi : మెగాస్టార్ కొత్త యాడ్ చూసారా? యాడ్‌లో కూడా డ్యూయల్ రోల్..
ఈ సారి ప్రభాస్ సలార్ క్యారెక్టర్ తో వినాయక విగ్రహాన్ని, అలాగే ఎన్టీఆర్ దేవర క్యారెక్టర్ తో విగ్రహాన్ని తయారుచేసారు. సలార్ వినాయకుడు, దేవర వినాయకుడు అంటూ ఈ విగ్రహాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అనంతపూర్ లో సలార్ గణేశుడ్ని పెట్టగా, అనకాపల్లిలో దేవర గణేశుడ్ని పెట్టారు. దీంతో ఈ రెండు విగ్రహాల ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
ఆ హీరోల ఫ్యాన్స్ ఈ విగ్రహాలను చూసి మురిసిపోతుంటే భక్తులు మాత్రం ఇదేం పైత్యం దేవుడ్ని దేవుడిలా కాకుండా ఇలా సినిమాల క్యారెక్టర్స్ తో చేసారు అని తిట్టుకుంటున్నారు.
Anantapur katteramma ganesh #Salaar #Prabhas𓃵 🙏🏻🛐🙇🏻 #GaneshChaturthiSpecial #GaneshaFestival #GaneshChaturthi2024 pic.twitter.com/BXykr7r2mu
— Poorna_Mahindra👑❤️🔥 (@TPoornachanda) September 7, 2024
Anakapalli lo Devarodi Massss….. #HappyVinayakaChavithi#Devara #DevaraSep27 pic.twitter.com/5wD0no28hk
— S@i (@saintrfan9) September 8, 2024