Chiranjeevi : మెగాస్టార్ కొత్త యాడ్ చూసారా? యాడ్‌లో కూడా డ్యూయల్ రోల్..
తాజాగా చిరంజీవి మరో కొత్త యాడ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

Megastar Chiranjeevi New Commercial Advertisement under Harish Shankar Direction Watch Here
Chiranjeevi : మన సెలబ్రిటీలు సినిమాలతో పాటు యాడ్స్ లో కూడా పలకరిస్తారని తెలిసిందే. ఇప్పుడిప్పుడు వచ్చిన స్టార్లే యాడ్స్ చేసేస్తుంటే స్టార్ హీరోలు చేయకుండా ఉంటారా. సెకండ్ ఇన్నింగ్స్ లో మన మెగాస్టార్ చిరంజీవి కూడా అప్పుడప్పుడు పలు యాడ్స్ చేసి అటు కమర్షియల్ గా సక్సెస్ అవుతూనే ఇటు ఫ్యాన్స్ ని కూడా మెప్పిస్తున్నారు. తాజాగా చిరంజీవి మరో కొత్త యాడ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
Also Read : Viran Muttamsetty : అల్లు అర్జున్ కజిన్ విరాన్ ముత్తంశెట్టి.. కొత్త సినిమా అనౌన్స్..
హరీష్ శంకర్ దర్శకత్వంలో చిరంజీవి కంట్రీ డిలైట్ అనే పాల యాడ్ చేసారు. యాడ్ లో కూడా డ్యుయల్ రోల్ లో నటించి మెప్పించారు. ఈ యాడ్ లో చిరంజీవితో పాటు కమెడియన్ సత్య కూడా నటించారు. ప్రస్తుతం ఈ యాడ్ యూట్యూబ్ లో ట్రెండ్ అవుతుంది. మీరు కూడా చిరంజీవి కొత్త యాడ్ చూసేయండి..