Viran Muttamsetty : అల్లు అర్జున్ కజిన్ విరాన్ ముత్తంశెట్టి.. కొత్త సినిమా అనౌన్స్..
తాజాగా వినాయకచవితి సందర్భంగా విరాన్ ముత్తంశెట్టి తన కొత్త సినిమాని ప్రకటించాడు.

Allu Arjun Cousin Viran Muttamsetty New Movie Guilt Title Poster Released
Viran Muttamsetty : అల్లు అర్జున్ కజిన్ విరాన్ ముత్తంశెట్టి ఇప్పటికే హీరోగా, విలన్ గా పలు సినిమాల్లో మెప్పించాడు. ఇటీవల బ్యాక్ టు బ్యాక్ ముఖ్య గమనిక సినిమాలో హీరోగా, పురుషోత్తముడు సినిమాలో విలన్ గా మెప్పించాడు. తాజాగా వినాయకచవితి సందర్భంగా విరాన్ ముత్తంశెట్టి తన కొత్త సినిమాని ప్రకటించాడు.
విరాన్ ముత్తంశెట్టి హీరోగా నేడు వినాయకచవితి సందర్భంగా కొత్త సినిమా టైటిల్ పోస్టర్ రిలీజ్ చేసారు. ‘గిల్ట్’ అనే టైటిల్ తో ఈ సినిమా రాబోతుంది. యూత్ ఫుల్ లవ్ స్టోరీతో పాటు క్రైం, యాక్షన్ సినిమాగా గిల్ట్ రాబోతుంది. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటుంది. ఓ కొత్త రకం లవ్ స్టోరీతో ఈ గిల్ట్ సినిమా తెరకెక్కుతుంది.
Also Read : Telugu Indian Idol : పవన్ కళ్యాణ్ OG సినిమాలో.. పాట పాడిన ఆహా తెలుగు ఇండియన్ ఐడల్ 3 కంటెస్టెంట్స్..
విరాన్ ముత్తంశెట్టి గిల్ట్ సినిమాని శ్రీ కమలహాసిని మూవీ మేకర్స్ బ్యానర్ పై లక్ష్మీ సునీల, డా. పార్థసారథి రెడ్డి, ఎ.శివ కుమార్ నిర్మాణంలో చలపతి పువ్వల దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. తాజాగా రిలీజ్ చేసిన టైటిల్ పోస్టర్ లో ప్రేమ, క్రైం కనపడేలా ఆసక్తిగా డిజైన్ చేసారు.