×
Ad

Vithika Sheru : వామ్మో.. ఈ హీరోయిన్ సిక్స్ ప్యాక్ చూశారా?

ఇప్పటివరకు హీరోల సిక్స్ ప్యాక్ లు చూశాము కానీ హీరోయిన్స్ సిక్స్ ప్యాక్ లు చాలా రేర్. అలాంటిది వితికా ఇలా సిక్స్ ప్యాక్ చూపించడంతో..

  • Published On : December 2, 2023 / 04:41 PM IST

Varun Sandesh Wife Actress Vithika Sheru Shares Six Pack Photos in Social Media

Vithika Sheru : ఒకప్పటి హీరోయిన్, నటుడు వరుణ్ సందేశ్(Varun Sandesh) భార్య వితిక షేరు అందరికి పరిచయమే. గతంలో నటిగా తెలుగు, తమిళ్ లో పలు సినిమాలు చేసింది వితిక షేరు. వరుణ్ సందేశ్ తో పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉన్నా అప్పుడప్పుడు పలు టీవీ షోలలో పాల్గొంటుంది. అలాగే యూట్యూబ్ లో వీడియోలు చేస్తూ, సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది.

వితికా రెగ్యులర్ గా సోషల్ మీడియాలో తన ఫొటోలు, జిమ్ కి సంబంధించిన ఫొటోలు, వీడియోలు పోస్ట్ చేస్తూ ఉంటుంది. కొన్ని రోజులుగా వితికా తన బాడీ కోసం ఎక్కువగా జిమ్ లో ట్రైన్ అవుతుంది. తాజాగా వితికా సిక్స్ ప్యాక్ తెచ్చుకొని తన సిక్స్ ప్యాక్ చూపిస్తూ హాట్ హాట్ ఫోటోలని సోషల్ మీడియాలో షేర్ చేసింది.

Also Read : Salaar Movie : సలార్ పార్ట్ 1 సినిమా ప్రభాస్‌ది కాదా? పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోనా?

ఇప్పటివరకు హీరోల సిక్స్ ప్యాక్ లు చూశాము కానీ హీరోయిన్స్ సిక్స్ ప్యాక్ లు చాలా రేర్. అలాంటిది వితికా ఇలా సిక్స్ ప్యాక్ చూపించడంతో అంతా ఆశ్చర్యపోతూ.. సూపర్ అని కామెంట్స్ చేస్తున్నారు. నెటిజన్లు, పలువురు ప్రముఖులు వితికా సిక్స్ ప్యాక్ తో అదరగొడుతుంది హాట్ ఫొటోలతో అని కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి వితికా ఇలాంటి సిక్స్ ప్యాక్ ఫొటోలతో వైరల్ గా మారింది.