Varun tej : మాస్ దర్శకుడితో వరుణ్ తేజ్ మూవీ.. 1960 బ్యాక్‌డ్రాప్‌తో కథ.. నిజమేనా..?

డిఫరెంట్ జోనర్స్ లో సినిమాలు చేసుకుంటూ వెళ్లే వరుణ్ తేజ్.. ఇప్పుడు వైవిధ్యమైన సినిమాలు చేసే మాస్ దర్శకుడితో ఒక పీరియడ్ యాక్షన్ డ్రామా చేయబోతున్నాడని తెలుస్తుంది.

Varun tej 14 movie with Palasa 1978 director Karuna Kumar

Varun tej : మెగా హీరోల్లో వరుణ్ తేజ్ కథల ఎంపిక చాలా బాగుంటుందని ఆడియన్స్ అంటుంటారు. హీరో ఎంట్రీ ఇచ్చిన కొంత కాలంలోనే డిఫరెంట్ జోనర్స్ లో సినిమాలు చేస్తూ వచ్చాడు. ప్రస్తుతం ఈ హీరో గాండీవధారి అర్జున అండ్ VT13 వంటి బ్యాక్ టు బ్యాక్ స్పై యాక్షన్ థ్రిల్లర్స్ తో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. VT13 షూటింగ్ జరుపుకుంటుంటే, గాండీవధారి అర్జున వచ్చే నెల రిలీజ్ కి సిద్దమవుతుంది. ఇది ఇలా ఉంటే, వరుణ్ కొత్త సినిమాకి సంబంధించిన న్యూస్ ఒకటి ఫిలిం వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.

Ram Charan : పెళ్ళైన కొత్తలో ఉపాసన.. రామ్ చరణ్‌ చెంప పై కొట్టిందట.. ఎందుకో తెలుసా..?

టాలీవుడ్ లో పలాస 1978, శ్రీదేవి సోడా సెంటర్ వంటి వైవిధ్యమైన మాస్ సినిమాలు తెరకెక్కించి మంచి పేరుని సంపాదించుకున్న దర్శకుడు ‘కరుణ కుమార్’. ఇప్పుడు ఈ దర్శకుడితో వరుణ్ తన 14వ సినిమాని చేయబోతున్నాడని తెలుస్తుంది. అది కూడా పీరియడ్ యాక్షన్ డ్రామా అని సమాచారం. 1960 బ్యాక్‌డ్రాప్‌తో ఈ మూవీ కథ ఉండబోతుందట. ఇటీవల వరుస సినిమాలు అనౌన్స్ చేస్తున్న వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ ఈ సినిమాని నిర్మించబోతుందని, ఈ నెల 27న ఈ మూవీ పూజా కార్యక్రమాలతో అఫీషియల్ గా లాంచ్ అవ్వబోతుందని ఫిలిం వర్గాల్లో వినిపిస్తుంది.

Ram Charan : ఆస్కార్‌కి వెళ్లిన రాత్రి.. చరణ్ అండ్ ఎన్టీఆర్‌కి రాజమౌళి గట్టి వార్నింగ్ ఇచ్చాడట.. ఎందుకో తెలుసా..?

మరి ఈ వార్తలో నిజమెంత ఉందో తెలియదు. అయితే దర్శకుడు కరుణ కుమార్ రియల్ ఇన్సిడెంట్స్ ని తీసుకోని సినిమాని రా అండ్ రస్టిక్ గా తెరకెక్కిస్తాడు. దీంతో ఈ వార్త నిజం అయితే బాగుండని మెగాభిమానులు కోరుకుంటున్నారు. ఇక గాండీవధారి అర్జున మూవీ విషయానికి వస్తే.. ఈ సినిమా టీజర్ ని రేపు జులై 24 ఉదయం 10:08 నిమిషాలకు రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ తెలియజేసింది. ఇప్పటికే రిలీజ్ చేసిన ప్రీ టీజర్ మూవీ పై అంచనాలని క్రియేట్ చేసింది.

 

ట్రెండింగ్ వార్తలు