Ram Charan : పెళ్ళైన కొత్తలో ఉపాసన.. రామ్ చరణ్‌ చెంప పై కొట్టిందట.. ఎందుకో తెలుసా..?

రామ్ చరణ్ అండ్ ఉపాసన ఒకరి పై ఒకరు ఎంత ప్రేమగా ఉంటారో అనేది అందరికి తెలిసిందే. అయితే పెళ్ళైన కొత్తలో ఉపాసన, చరణ్ చెంప పై కొట్టిందట. అది ఎందుకో తెలుసా..?

Ram Charan : పెళ్ళైన కొత్తలో ఉపాసన.. రామ్ చరణ్‌ చెంప పై కొట్టిందట.. ఎందుకో తెలుసా..?

Ram Charan said early in his marriage upasana slap on his face

Updated On : July 23, 2023 / 10:44 AM IST

Ram Charan : టాలీవుడ్ స్టార్ కపుల్ రామ్ చరణ్ అండ్ ఉపాసన (Upasana) గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఒకరి పై మరొకరు ఎంతో ప్రేమని చూపించుకుంటూ ప్రతి ఒక్కరి మనసు దోచుకుంటూ వస్తున్నారు. కాగా వీరిద్దరిది ప్రేమ వివాహం అని అందరికి తెలిసిందే. కాలేజీ స్నేహితులైన వీరిద్దరూ 2012 లో పెద్దల్ని ఒప్పించి అంగరంగా వైభంగా పెళ్లి చేసుకున్నారు. అయితే తాజాగా రామ్ చరణ్ ఒక ఇంటర్వ్యూలో.. పెళ్ళైన కొత్తలో జరిగిన ఒక ఇన్సిడెంట్ ని బయట పెట్టాడు. పెళ్ళైన కొత్తలో ఉపాసన తన చెంప పై కొట్టినట్లు చెప్పుకొచ్చాడు.

Ram Charan : రామ్ చరణ్‌ మొదటి రెమ్యూనరేషన్‌తో ఏమి కొన్నాడో తెలుసా..? ఎక్కువుగా కొనేదేంటో తెలుసా..?

రామ్ చరణ్ అసలు విషయం చెబుతూ.. “అమ్మాయిలకి ఎటువంటి గిఫ్ట్స్ ఇస్తే నచ్చుతుందో అనేది ఆలోచించడం మగవాళ్ళకి ఒక పెద్ద టాస్క్ లాంటిది. నేను ఊరంతా తిరిగి 5 గంటల కష్టపడి ఒక ఖరీదైన బహుమతి కొంటే, దానిని కేవలం 5 సెకండ్స్ లో రిజెక్ట్ చేసేసింది ఉపాసన. అంతేకాదు దాని వల్ల తన చేతిలో చెంప దెబ్బ కూడా తిన్నాను” అని చెప్పుకొచ్చాడు. ఇక ఈ వీడియో చూసిన అభిమానులు.. ‘మరి దెబ్బలు తినే అంత పిచ్చి గిఫ్ట్ ఏమి ఇచ్చావు అన్న’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Ram Charan : ఆస్కార్‌కి వెళ్లిన రాత్రి.. చరణ్ అండ్ ఎన్టీఆర్‌కి రాజమౌళి గట్టి వార్నింగ్ ఇచ్చాడట.. ఎందుకో తెలుసా..?

కాగా రామ్ చరణ్ అండ్ ఉపాసన తమ పెళ్ళైన 11 ఏళ్ళ తరువాత ఈ ఏడాది తల్లిదండ్రులు అయ్యారు. జూన్ 20న ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనించింది. ఆ పాపకి లలితా సహస్రనామం నుంచి స్ఫూర్తి పొంది ‘క్లీంకార’ (Klin Kaara) అనే పేరుని పెట్టారు. అంతేకాదు క్లీంకార నామకరణ కార్యక్రమాన్ని ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ‌, క‌ర్ణాట‌క‌, ఒడిస్సా అటవీ ప్రాంతాల్లో నివసించే చెంచు జాతి సంస్కృతిలో నిర్వహించి అందరి మన్ననలు అందుకున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ తమ బేబీతో హ్యాపీ లైఫ్ ని ఎంజాయ్ చేస్తున్నారు.