Varun Tej Son: కొడుకు ‘వాయువ్ తేజ్’ను పరిచయం చేసిన వరుణ్ తేజ్- లావణ్య.. ఎంత క్యూట్ గా ఉన్నాడో చూడండి!

వరుణ్ తేజ్(Varun Tej Son) తన ముద్దుల కొడుకును సోషల్ మీడియా వేదికగా ప్రేక్షకులకు పరిచయం చేస్తూ పంచుకున్న అరుదైన దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Varun Tej and Lavanya introduce their son Vaayuv Tej on social media

Varun Tej Son: టాలీవుడ్ మెగా ఫ్యామిలీకి చెందిన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్- నటి లావణ్య త్రిపాఠి దంపతులు ఇటీవల తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందిన సంగతి తెలిసిందే. తమ ఇంట్లోకి అడుగుపెట్టిన పండంటి బాబు రాకతో ఆ కుటుంబంలో సందడి వాతావరణం నెలకొంది. ఈ సంతోషకరమైన వార్తను అభిమానులతో పంచుకున్న నాటి నుండి, మెగా వారసుడిని ఎప్పుడు చూపిస్తారా అని సినీ అభిమానులు, నెటిజన్లు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఆ నిరీక్షణకు తెరదించుతూ వరుణ్ తేజ్(Varun Tej Son) తన ముద్దుల కొడుకును సోషల్ మీడియా వేదికగా ప్రేక్షకులకు పరిచయం చేస్తూ పంచుకున్న అరుదైన దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Ganesha Idol for Home: గణపతి విగ్రహం కొనేముందు జాగ్రత్త.. కుడి, ఎడమ తొండం వెనుక రహస్యం.. ఇంట్లోకి ఏ విగ్రహం శ్రేయస్కరం?

తండ్రీకొడుకుల అపూర్వ దృశ్యం.. సోషల్ మీడియాలో మెగా ఫ్యాన్స్ కోలాహలం:

వరుణ్ తేజ్ తన కొడుకును ఎంతో ప్రేమగా ఎత్తుకుని ఉన్న పిక్‌ను పంచుకోవడంతో అభిమానుల సంతోషానికి హద్దులు లేకుండా పోయాయి. బాబు ముఖం కనిపించేలా ఉన్న ఈ ఫొటోలను చూసి మెగా అభిమానులు, సినీ ప్రముఖులు ఆ చిన్నారికి శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. తమ ఇంట్లోకి వచ్చిన కొత్త వెలుగును పరిచయం చేస్తూ వరుణ్ తేజ్ షేర్ చేసిన ఈ పోస్ట్ క్షణాల్లోనే లక్షలాది లైక్స్‌తో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో నిలిచింది. మెగా వారసుడి రాకతో అటు అల్లు, ఇటు కొణిదెల కుటుంబాల్లో సరికొత్త ఉత్సాహం నిండిపోయింది.