Varun Tej : నిర్మాతల కోసం వరుణ్ తేజ్ గొప్ప నిర్ణయం.. గ్రేట్ అంటున్న అభిమానులు..
వరుణ్ తేజ్ నిర్మాతల కోసం ఆ నిర్ణయం తీసుకుంటున్నాడట. త్వరలోనే..
- gum 95921
- Updated on- August 31, 2023 / 05:33 PM IST
Varun Tej do another projects for Ghani Gandeevadhari Arjuna producers
మెగా హీరో వరుణ్‌తేజ్ కెరీర్ ఆరంభం నుంచి కొత్తదనానికి పెద్దపీట వేస్తూ డిఫరెంట్ రోల్స్ ఎంచుకుంటూ మెగా కాంపౌండ్‌లో మంచి నటుడిగా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపుని సంపాదించుకున్నాడు. తన సినిమాలు హిట్, ప్లాప్ టాక్‌లతో సంబంధం లేకుండా తనకి నచ్చినట్లు వైవిధ్యమైన సినిమాలు చేయడమే వరుణ్‌తేజ్ స్టైల్. ఈక్రమంలోనే ఫిదా, ఎఫ్2 వంటి బ్లాక్‌బస్టర్లు అందుకున్న వరుణ్‌తేజ్ కెరీర్‌లో.. గని, గాండీవధారి అర్జున వంటి డిజాస్టర్లు కూడా ఉన్నాయి. అయితే ఆ డిజాస్టర్స్ నుంచి తాను కోలుకోవడమే కాకుండా తన నిర్మాతలు కూడా బయట పడడానికి వరుణ్ సహాయపడుతున్నాడని సమాచారం.
Vijay Deverakonda : పోకిరి సినిమాలో మాదిరి నా మూవీలో కూడా.. ఫ్యాన్స్ ఆ పని చేయొద్దు..
గని, గాండీవధారి అర్జున ప్లాప్‌లతో ఆ సినిమాలు చేసిన నిర్మాతలు తీవ్రంగా నష్టపోయారు. ఆగస్టు 25న రిలీజైన గాండీవధారి అర్జున బాక్సీఫీస్ వద్ద బోల్తాపడింది. ఈ సినిమా వాల్యూ బిజినెస్ 17 కోట్లు ఉండగా, 18 కోట్ల రూపాయలు బ్రేక్ ఈవెన్ టార్గెట్‌గా పెట్టుకున్నారు. అయితే ఈ సినిమా తొలిరోజే ఆశించిన కలెక్షన్లు వసూలు రాబట్టలేక నిరాశ పరిచింది. ప్రపంచ వ్యాప్తంగా రెండున్నర కోట్ల రూపాయల గ్రాస్ మాత్రమే వసూలైందని చెబుతున్నారు. ఇక గని సినిమా కూడా వరుణ్ కెరీర్‌లోనే అతిపెద్ద డిజాస్టర్‌గా నిలిచింది.
Vijay Deverakonda : సందీప్ వంగతో మరో సినిమా చేస్తా.. అలాగే తమిళ్ డైరెక్టర్స్..
ఈ విషయాన్ని స్వయంగా వరుణ్‌తేజే అంగీకరించారు. దీంతో ఈ రెండు చిత్రాల నిర్మాతల కోసం వరుణ్ మరో రెండు చిత్రాలు చేయాలని అనుకుంటున్నట్లు టాలీవుడ్ టాక్. అయితే ఈ సినిమాలు ఎప్పుడు ప్రారంభమవుతాయో, డైరెక్టర్లు ఎవరో అనేది ఇంకా క్లారిటీ రాలేదు. కానీ, ఆ రెండు సంస్థలకు రెండు సినిమాలు చేయడం మాత్రం పక్కా అని అంటున్నారు. కాగా వరుణ్ ప్రస్తుతం ‘ఆపరేషన్ వాలెంటైన్’ (Operation Valentine), ‘మట్కా’ (Matka) చిత్రాల్లో నటిస్తున్నాడు. ఆపరేషన్ వాలెంటైన్ షూటింగ్ దాదాపు పూర్తి అయ్యినట్లు సమాచారం. త్వరలోనే మట్కా షూటింగ్ మొదలు పెట్టనున్నాడు. ఈ రెండు చిత్రాలు కూడా డిఫరెంట్ జోనర్స్ లోనే ఉండబోతున్నాయి.
