Vijay Deverakonda : సందీప్ వంగతో మరో సినిమా చేస్తా.. అలాగే తమిళ్ డైరెక్టర్స్..

ఖుషి ప్రమోషన్స్ విజయ్ దేవరకొండ తన తదుపరి సినిమాల లైనప్ తెలియజేశాడు. సందీప్ వంగతో పాటు..

Vijay Deverakonda : సందీప్ వంగతో మరో సినిమా చేస్తా.. అలాగే తమిళ్ డైరెక్టర్స్..

Vijay Deverakonda about Sandeep Reddy Vanga Arun Matheswaran Arun Prabu movies

Updated On : August 31, 2023 / 4:19 PM IST

Vijay Deverakonda : విజయ్ దేవరకొండ నటించిన కొత్త సినిమా ‘ఖుషి’ (Kushi) ఈ శుక్రవారం సెప్టెంబర్ 1న పాన్ ఇండియా వైడ్ రిలీజ్ కాబోతుంది. దీంతో విజయ్ తో పాటు హీరోయిన్ సమంత (Samantha), డైరెక్టర్ శివ నిర్వాణ, ప్రొడ్యూసర్ రవిశంకర్, సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వాహాబ్ సోషల్ మీడియా లైవ్ ద్వారా నేషనల్ వైడ్ ఫ్యాన్స్ తో ఇంటరాక్ట్ అయ్యారు. ఈ ఇంటరాక్షన్ లో విజయ్ దేవరకొండ తనకి అర్జున్ రెడ్డి వంటి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన సందీప్ వంగతో మరో మూవీ పై ఆసక్తికర కామెంట్స్ చేశాడు.

Vijay Deverakonda : నటనకు విరామం ఇచ్చి.. డైరెక్షన్ చేస్తా.. అలాగే బిజినెస్ కూడా..

“సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో నాది మరో మూవీ కచ్చితంగా ఉంటుంది. అయితే అది ఎప్పుడనేది మాత్రం నేను చెప్పలేను” అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఈ కాంబినేషన్ గురించి మైత్రీ నిర్మాత మాట్లాడుతూ.. “విజయ్ తో డియర్ కామ్రేడ్, ఖుషి వంటి లవ్ స్టోరీ మూవీస్ చేశాం. ఈసారి మూడో సినిమాని సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్ లో చేయాలని ప్లాన్ చేస్తున్నాం. విజయ్, సందీప్ కాంబినేషన్ ఎలా ఉంటుందో మీకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు” అంటూ పేర్కొన్నారు. దీంతో త్వరలోనే ఈ కాంబినేషన్ సెట్ అయ్యే ఛాన్స్ ఉందని తెలుస్తుంది.

Vijay Deverakonda : పెళ్లి పై విజయ్ దేవరకొండ కామెంట్స్.. అలాంటి అమ్మాయి..

సందీప్ ప్రస్తుతం రణబీర్ తో యానిమల్ తెరకెక్కిస్తున్నాడు. ఆ తరువాత అల్లు అర్జున్ తో ఒక మూవీ చేయాల్సి ఉంది. ఇక విజయ్ కూడా VD12, VD13 సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఈ రెండు సినిమాల స్క్రిప్ట్స్ ఓ రేంజ్ లో ఉంటాయని మాత్రం చెప్పుకొచ్చాడు. అలాగే తమిళ్ డైరెక్టర్స్ అరుణ్ మాతేశ్వరన్, అరుణ్ ప్రభు తో స్క్రిప్ట్స్ వర్క్స్ జరుగుతున్నాయని, స్క్రిప్ట్స్ లాక్ అయితే వెంటనే మూవీస్ ప్రారంభిస్తానని వెల్లడించాడు. అరుణ్ మాతేశ్వరన్ ప్రస్తుతం ధనుష్ తో ‘కెప్టెన్ మిల్లర్’ తెరకెక్కిస్తున్నాడు. ఇక అరుణ్ ప్రభు.. అరువి, వాజ్ల్ వంటి సక్సెస్‌ఫుల్ మూవీస్ చేశాడు.