Varun Tej : ఆమె గత జన్మలో కొరియన్.. హీరోయిన్ పై వరుణ్ తేజ్ కామెంట్స్..
వరుణ్ తేజ్ కొరియన్ కనకరాజు సినిమాతో రాబోతున్నారు. (Varun Tej)
- Saketh U
- Updated on- August 6, 2026 / 03:29 PM IST
Varun Tej Interesting Comments On Actress Ritika Nayak
Varun Tej : వరుణ్ తేజ్, రితిక నాయక్ జంటగా కొరియన్ కనకరాజు సినిమాతో రాబోతున్నారు. ఈ సినిమా రేపు ఆగస్టు 7న థియటర్స్ లో రిలీజ్ కానుంది. ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా హీరోలోకి కొరియన్ గ్యాంగ్ స్టర్ ఆత్మ ప్రవేశించడం, కొరియా వెళ్లి అక్కడ రివెంజ్ తీర్చుకోవడం అనే కథాంశంతో కామెడీ యాక్షన్ గా తెరకెక్కింది.
కొరియన్ కనకరాజు సినిమాలో హీరోయిన్ రితిక నాయక్ కియా కార్ల కంపెనీలో పనిచేసే అమ్మాయిగా, కొరియా, కొరియన్ సినిమాలు, సాంగ్స్ ఇష్టం ఉండే అమ్మాయిగా, కొరియా మాట్లాడే అమ్మాయిగా కనిపించనుంది. నేడు వరుణ్ తేజ్ మీడియాతో మాట్లాడగా రితికపై ఆసక్తికర కామెంట్స్ చేసారు.
వరుణ్ తేజ్ మాట్లాడుతూ.. ఈ సినిమాలో రితిక నాయక్ పాత్ర తన రియల్ లైఫ్ పాత్రకు చాలా దగ్గరగా ఉంటుంది. మేము కొరియాకు వెళ్ళినప్పుడు రితిక తను గత జన్మలో కొరియన్ ని అని చెప్పేది. కొరియన్ మాట్లాడుతుంది, కొరియా సినిమాలు చూస్తుంది, K పాప్ వింటుంది. కొరియా అంటే తనకు చాలా ఇష్టం. కొరియాకు వెళ్ళినపుడు తను అక్కడే పుట్టింది అన్నట్టు ఎంజాయ్ చేసింది. అందుకే ఆ పాత్రకు రితిక పర్ఫెక్ట్ గా సెట్ అయింది అని తెలిపాడు.
