Nagababu Varun Tej : ఫస్ట్ టైం కలిసి నటించబోతున్న తండ్రి కొడుకులు.. నాగబాబు – వరుణ్ తేజ్ కాంబో రెడీ.. నిహారిక నిర్మాత..
మొదటిసారి తన తండ్రి నాగబాబుతో కలిసి నటిస్తున్నాను అని ప్రకటించాడు. (Nagababu Varun Tej)
Nagababu Varun Tej
Nagababu Varun Tej : వరుణ్ తేజ్ నటించిన కొరియన్ కనకరాజు సినిమా ఆగస్టు 7న రిలీజ్ కానుంది. తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో వరుణ్ తేజ్ ఆసక్తికర విషయం తెలిపాడు. మొదటిసారి తన తండ్రి నాగబాబుతో కలిసి నటిస్తున్నాను అని ప్రకటించాడు.
నాగబాబు నటుడిగా ఎన్నో సినిమాల్లో నటించినా మెగా ఫ్యామిలిలో చిరు, చరణ్, పవన్, సాయి ధరమ్ తేజ్.. ఇలా అందరి హీరోలతో కూడా ఏదో ఒక సినిమాలో కలిసి నటించాడు. కానీ తన సొంత కొడుకు వరుణ్ తేజ్ తో మాత్రం నాగబాబుకు ఇప్పటివరకు కలిసి నటించే అవకాశం రాలేదు.
నాగబాబు మెయిన్ లీడ్ లో నటించిన హ్యాండ్స్ అప్ సినిమాలో మాత్రం వరుణ్ తేజ్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాడు. అప్పుడు కూడా నాగబాబు – వరుణ్ కి కాంబినేషన్ సీన్స్ లేవు. మొదటిసారి ఈ ఇద్దరూ కలిసి బరి సినిమాలో నటిచబోతున్నారని వరుణ్ తెలిపాడు. ఈ సినిమాకు నాగబాబు కూతురు నిహారిక నిర్మాత కావడం విశేషం.
నిహారిక నిర్మాణంలో కమిటీ కుర్రాళ్ళు ఫేమ్ యదు వంశీ దర్శకత్వంలో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ తో బరి సినిమా తెరకెక్కుతుంది. వరుణ్ తేజ్ కాలు గాయం నుంచి పూర్తిగా కోలుకున్నాక ఈ సినిమా షూటింగ్ మొదలవ్వనుంది. ఈ సినిమాలో మొదటిసారి వరుణ్ తేజ్ – నాగబాబు కలిసి నటించబోతున్నారని, వీరిద్దరికి కాంబినేషన్ సీన్స్ కూడా ఉన్నాయని తెలిపాడు వరుణ్. దీంతో బరి సినిమాపై మరింత ఆసక్తి నెలకొంది.
