Korean Kanakaraju : ‘కొరియన్ కనకరాజు’ రేపే రిలీజ్.. హిట్ అవ్వాలంటే ఎన్ని కోట్లు కలెక్ట్ చేయాలి.. ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత..

కొరియన్ కనకరాజు థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్ .. (Korean Kanakaraju)

  • Published on- August 6, 2026 / 09:51 AM IST

Korean Kanakaraju

Korean Kanakaraju : వరుణ్ తేజ్, రితిక నాయక్ జంటగా యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై మేర్లపాక గాంధీ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కొరియన్ కనకరాజు. ఆగస్టు 7న ఈ సినిమా రిలీజ్ అవుతుంది. ఇప్పటికే రిలీజయిన టీజర్, ట్రైలర్స్ తో ఈ సినిమా పై భర్తీ అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ సినిమాకు నాన్ థియేట్రికల్ బిజినెస్ బాగానే జరిగినా థియేట్రికల్ బిజినెస్ మాత్రం వరుణ్ గత సినిమాల కంటే తక్కువే జరిగింది.

కొరియన్ కనకరాజు సినిమాని దాదాపు 38 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించారట. ఈ సినిమాకు ఓటీటీ, ఆడియో, హిందీ, శాటిలైట్.. ఇలా నాన్ థియేట్రికల్ హక్కుల ద్వారానే దాదాపు 26 కోట్లు వచ్చినట్టు సమాచారం. ఇక థియేట్రికల్ గా ఈ సినిమా కేవలం 13 కు మాత్రమే అమ్ముడుపోయినట్టు సమాచారం.

Also Read : Korean Kanakaraju First Review : ‘కొరియన్‌ కనకరాజు’ ఫస్ట్ రివ్యూ.. ఈసారైనా వరుణ్ తేజ్ హిట్ కొడతాడా..?

కొరియన్ కనకరాజు థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్ ..

నైజాం – 4 కోట్లు
ఆంద్ర – 5 కోట్లు
సీడెడ్ – 2 కోట్లు
రెస్టాఫ్ ఇండియా & ఓవర్సీస్ – 2 కోట్లు

మొత్తంగా కొరియన్ కనకరాజు సినిమా 13 కోట్లకు థియేట్రికల్ బిజినెస్ జరిగినట్టు సమాచారం. ఈ సినిమా హిట్ అవ్వాలంటే కనీసం 26 నుంచి 30 కోట్ల గ్రాస్ వసూలు చేయాలి థియేటరికల్ గా. ఈ సినిమాకు ఉన్న హైప్, వేరే సినిమాలు ఏమి ఈ వారం పోటీకి లేకపోవడంతో కొరియన్ కనకరాజు ఈజీగానే 50 కోట్లు కలెక్ట్ చేస్తుందని టాక్.

Also Read : Thaman : తమన్ కమెడియన్ గా నటించిన సినిమా.. ఇప్పుడు ఓటీటీలో.. అస్సలు మిస్ అవ్వొద్దు..

వరుణ్ తేజ్ గత మూడు సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో ఆ ఎఫెక్ట్ థియేట్రికల్ బిజినెస్ మీద పడి తక్కువ రేటుకు కొరియన్ కనకరాజు అమ్ముడుపోయింది తెలుస్తుంది. కానీ ఈ సినిమాకు మంచి హైప్ ఉంది కాబట్టి ఈజీగా మొదటి వీకెండ్ కే బ్రేక్ ఈవెన్ అవుతుందని నమ్ముతున్నారు మూవీ యూనిట్.