×
Ad

Varun Lavanya : బాబోయ్.. వరుణ్, లావణ్య.. ఒకరి గురించి ఒకరికి ఇంత బాగా తెలుసా? ఇది మాములు పర్ఫెక్ట్ జోడి కాదు..

ప్రమోషన్స్ లో భాగంగా ఇద్దరూ సూపర్ సింగర్ ప్రోగ్రాంకి వచ్చారు. తాజగా ఈ ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ చేయగా పాటలతో పాటు లావణ్య, వరుణ్ క్యూట్ మూమెంట్స్ తో సరదాగా సాగింది.

  • Published On : February 15, 2024 / 06:27 AM IST

Varun Tej Lavanya Tripathi Cute Moments in Super Singer Promo

Varun Lavanya : మెగా హీరో వరుణ్ తేజ్ – హీరోయిన్ లావణ్య త్రిపాఠి ఓ ఆరేళ్లుగా ప్రేమించుకొని గత సంవత్సరం గ్రాండ్ గా వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఇద్దరూ హ్యాపీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. పెళ్లి తర్వాత హనీమూన్ ట్రిప్స్, ఫ్యామిలీ ట్రిప్స్ అన్ని అయిన తర్వాత ఇటీవల కొన్ని రోజుల నుంచి సినిమా వర్క్స్ మళ్ళీ మొదలుపెట్టారు.

లావణ్య ఇటీవల మిస్ పర్ఫెక్ట్(Miss Perfect) అనే వెబ్ సిరీస్ తో పలకరించింది. ఈ సిరీస్ డిస్నీప్లస్ హాట్ స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది. ఇక వరుణ్ తేజ్ త్వరలో ఆపరేషన్ వాలెంటైన్(Operation Valentine) అనే సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమా మార్చ్ 1న రానుంది. వీటి ప్రమోషన్స్ లో భాగంగా ఇద్దరూ సూపర్ సింగర్ ప్రోగ్రాంకి వచ్చారు. అయితే ఇద్దరూ కలిసి కాకుండా వేరువేరుగా వచ్చినట్టు తెలుస్తుంది. తాజగా ఈ ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ చేయగా పాటలతో పాటు లావణ్య, వరుణ్ క్యూట్ మూమెంట్స్ తో సరదాగా సాగింది.

Also Read : Pawan Kalyan – Nani : పవన్ తనయుడు అకిరా దారిలో.. నాని కుమారుడు అర్జున్.. వీడియో వైరల్..

ఈ ఎపిసోడ్ లో వరుణ్ ఓ సారి, లావణ్య ఓ సారి రాగా.. ఇద్దర్ని ఒకటే ప్రశ్నలు అడిగారు. వరుణ్ లావణ్యని మొదటిసారి చూసినపుడు ఏం డ్రెస్ వేసుకుంది? వరుణ్ ఫేవరేట్ ఫుడ్ ఏంటి? ఇద్దరూ కలిసి మొదటిసారి వెకేషన్ కి ఎక్కడికి వెళ్లారు అని అడగ్గా.. ఇద్దరూ మూడు ప్రశ్నలకు ఆన్సర్స్ ఒకటే చెప్పడంతో అంతా ఆశ్చర్యపోయారు. వీళ్ళు మాములు పర్ఫెక్ట్ జోడి కాదు, అంతకుమించి అంటూ సరదాగా కామెంట్స్ చేస్తున్నారు.