Pawan Kalyan – Nani : పవన్ తనయుడు అకిరా దారిలో.. నాని కుమారుడు అర్జున్.. వీడియో వైరల్..

మొన్న పవన్ కళ్యాణ్ వారసుడు అకిరా నందన్, నేడు నాని తనయుడు అర్జున్. కంగారు పడుతున్న ఫ్యాన్స్.

Pawan Kalyan – Nani : పవన్ తనయుడు అకిరా దారిలో.. నాని కుమారుడు అర్జున్.. వీడియో వైరల్..

Nani son Arjun follows Pawan Kalyan son akira nandan

Updated On : February 14, 2024 / 8:32 PM IST

Pawan Kalyan – Nani : టాలీవుడ్ ఫ్యాన్స్ అంతా నెక్స్ట్ జనరేషన్ వారసులు కోసం ఎదురు చూస్తుంటే.. ఆ వారసులు మాత్రం హీరోగా కాకుండా, తమలోని టాలెంట్ వైపు అడుగులు వేస్తూ వెళ్తున్నారు. టాలీవుడ్ మోస్ట్ అవైటెడ్ వారసుడు ఎంట్రీ అంటే.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు ‘అకిరా నందన్‌’ది. పవర్ తనయుడు పవర్ ఫుల్ ఎంట్రీ కోసం అభిమానులు ఎదురు చూస్తుంటే, అకిరా మాత్రం.. మ్యూజిక్ వైపు ఇంటరెస్ట్ చూపిస్తూ సంగీత దర్శకుడిగా మారిపోతున్నాడు.

అకిరా పియానో నేర్చుకుంటూ అందులో ప్రావిణ్యం సంపాదిస్తున్నాడు. ఆ మధ్య ఓ షార్ట్ ఫిలింకి మ్యూజిక్ డైరెక్టర్ గా కూడా పని చేసాడు. ప్రస్తుతం సంగీతంలో మరిన్ని పాఠాలు నేర్చుకోవడానికి ఫారిన్ వెళ్ళాడు. అక్కడ ఫిలిం స్కూల్ లో సంగీత పాఠాలు నేర్చుకుంటున్నాడు. ఇండస్ట్రీలోని ఓ హీరో కొడుకు, ఇలా సంగీతం వైపు అడుగులు వేయడం అందర్నీ ఆశ్చర్యపరుస్తుంటే.. ఇప్పుడు మరో హీరో కుమారుడు కూడా అటు వైపే అడుగులు వేస్తూ కనిపిస్తూ ఆ హీరో అభిమానులను కూడా షాక్ కి గురి చేస్తున్నాడు.

Also read : Jabardasth pavithraa : పెళ్లి కాకముందే విడిపోయిన జబర్దస్త్ నటి.. ఎంగేజ్మెంట్ జరిగి కేవలం..

ఎటువంటి బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి వచ్చి స్టార్ హీరోగా ఎదిగిన నేచురల్ స్టార్ నాని.. ప్రస్తుతం పాన్ ఇండియా వైడ్ కూడా సినిమాలు చేస్తూ టాప్ హీరోగా కొనసాగుతున్నారు. ఇక స్వయంకృషితో వచ్చిన ఈ హీరో వారసుడు అర్జున్‌ని కూడా ఇండస్ట్రీలో హీరోగా చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు. అయితే అర్జున్ కూడా అకిరాలా సంగీతం వైపు మక్కువ చూపిస్తున్నట్లు తెలుస్తుంది.

హీరోగా ఎంట్రీ ఇవ్వడం కోసం డాన్స్‌లో ప్రావిణ్యం సంపాదించడం మానేసి పియానో పై సంగీత పాఠాలు నేర్చుకుంటున్నాడు. అర్జున్ పియానో వాయిస్తున్న వీడియోని వాలెంటైన్స్ సందర్భంగా నాని పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఆ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఏడేళ్ల వయసులోనే అర్జున్ చాలా బాగా పియానో వాయిస్తున్నాడంటూ ప్రతి ఒక్కరు అభినందిస్తున్నారు. మరి ఆ లవ్లీ వీడియోని మీరు కూడా చూసేయండి.

 

View this post on Instagram

 

A post shared by Nani (@nameisnani)