Jabardasth pavithraa : పెళ్లి కాకముందే విడిపోయిన జబర్దస్త్ నటి.. ఎంగేజ్మెంట్ జరిగి కేవలం..
ఎంగేజ్మెంట్ జరిగి కేవలం మూడు నెలలే అవుతుంది. పెళ్లి కాకముందే విడిపోయిన జబర్దస్త్ నటి. నిజామా..? ప్రాంకా..?

Jabardasth Actress Pavithraa break up with His Boy Friend Santhosh after engagement
Jabardasth pavithraa : జబర్దస్త్ షోతో మంచి గుర్తింపుని సంపాదించుకున్న నటి పవిత్ర.. యూట్యూబ్ ఛానల్ తో కూడా మంచి ఫేమ్ నే అందుకున్నారు. ఇక సోషల్ మీడియా ద్వారా ఆడియన్స్ కి దగ్గరగా ఉండే పవిత్ర.. గత ఏడాది నవంబర్ లో తన ప్రియుడితో నిశ్చితార్థం చేసుకున్న వార్తని తెలియజేసారు. ఎంగేజ్మెంట్ వార్తతో పాటు ప్రియుడిని కూడా ఒకేసారి ఆడియన్స్ కి పరిచయం చేశారు.
సంతోష్ అనే వ్యక్తితో సంవత్సరం పాటు ప్రేమాయణం నడిపిన పవిత్ర.. నవంబర్ లో పెళ్ళికి ఓకే చెప్పి నిశ్చితార్థం జరుపుకుంది. ఇక ఆ తరువాత నుంచి ఇద్దరు కలిసి డాన్స్ లు చేస్తూ సోషల్ మీడియాలో తెగ సందడి చేశారు. అయితే త్వరలో పెళ్లి వార్త చెబుతారని అందురు అనుకుంటే, ఇప్పుడు సడన్ గా విడిపోతున్న వార్త చెప్పారు. ఇద్దరు ఒకటిగా నిర్ణయించుకున్న తరువాతే విడిపోతున్నట్లు పవిత్ర తన ఇన్‌స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ వేశారు.
Also read : Nayanthara : మరోసారి ప్రేమలో పడిన నయనతార.. వాలంటైన్స్ డే నాడు ఆసక్తికర పోస్ట్..
View this post on Instagram
తమ నిర్ణయాన్ని అర్డంచేసుకొని, ఈ కష్ట సమయంలో తమకి సపోర్ట్ గా ఉండాలని కోరారు. కాగా ఈ పోస్ట్ కి కామెంట్స్ ఆప్షన్ ని పవిత్ర ఆఫ్ చేయడం గమనార్హం. అంతేకాదు, తన ఇన్‌స్టాలో సంతోష్ కి సంబంధించిన ఫోటోలను, వీడియోలను కూడా డిలీట్ చేసేసారు. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. వీరిద్దరూ నిజంగానే విడిపోతున్నారా లేదా అనే ప్రశ్నగా మారింది. ఎందుకంటే, గతంలో వీరిద్దరూ పెళ్లి విషయంలో కూడా ఒక ప్రాంక్ వీడియో చేశారు. దీంతో ఇప్పుడు ఈ పోస్ట్ కూడా అలా ప్రాంక్ విషయంలోనే చేసి ఉంటారని పలువురు సందేహం వ్యక్తం చేస్తున్నారు.