Varun Tej Lavanya Tripathi off to italy for their wedding
Varun Tej – Lavanya Tripathi : వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి మరికొన్ని రోజుల్లో ఏడడుగులు వేసి ఒకటి కాబోతున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్న వీరిద్దరూ జూన్ నెలలో కుటుంబసభ్యుల మధ్య నిశ్చితార్థం జరుపుకున్నారు. ఇప్పుడు ఇటలీలోని టుస్కానీ నగరంలో తమ పెళ్లి వేడుకను ఘనంగా జరుపుకోబోతున్నారు. ఈ పెళ్ళికి కూడా ఇరు కుటుంబసభ్యులు మాత్రమే హాజరుకాబోతున్నారు. అక్టోబర్ 30 నుంచి ఈ పెళ్లి వేడుక మొదలు కాబోతుంది. మూడు రోజులు పాటు జరగనున్న ఈ పెళ్లి పండుగ నవంబర్ 1న మూడుముళ్ల వేయడంతో ముగియనుంది.
ఇక ఈ వేడుకకు కోసం మెగా కుటుంబసభ్యులంతా ఒక్కొక్కరిగా ఇటలీ బయలుదేరారు. ముందుగా వధూవరులు అయిన వరుణ్, లావణ్య నేడు ఇటలీ బయలుదేరారు. హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి వీరిద్దరి నేడు ఇటలీ ఫ్లైట్ ఎక్కారు. వీరిద్దరితో పాటు నిహారిక, పంజా వైష్ణవ తేజ్ కూడా బయలుదేరారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది. ఇక ఈ పోస్ట్ చూసిన అభిమానులు, నెటిజెన్స్.. కొత్త జంటకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.
Also read : టాలీవుడ్ ఫస్ట్ స్పోర్ట్స్ బయోపిక్.. ఆ కబడ్డీ ప్లేయర్ కథని..
Finally 😍 Megacouple #Varunlav heading to Italy for their dream wedding off from Hyderabad papped together at airport @IAmVarunTej@Itslavanya#Varuntej #lavanyatripathi #bigfatwedding #megacelebration#southpaparazzi #tollywoodcelebs pic.twitter.com/OexWdOjFVC
— ARTISTRYBUZZ (@ArtistryBuzz) October 26, 2023
పెళ్లిని కుటుంబసభ్యుల మధ్యన మాత్రమే జరుపుకుంటున్న వరుణ్, లావణ్య.. నవంబర్ 5న హైదరాబాద్ లోని ఎన్ కన్వెన్షన్ హాల్ లో ఒక రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ వేడుకకు సినీ సెలబ్రిటీస్ తో పాటు పలువురు ప్రముఖులు కూడా హాజరుకానున్నారని సమాచారం. ఇక ఈ పెళ్లి కోసం మెగా హీరోలంతా తమ సినిమాలకు బ్రేక్ ఇచ్చి ఇటలీకి పయనమవుతుంటే మెగా అభిమానుల్లో ఒక సందేహం నెలకుంది. ఈ పెళ్ళికి పవన్ కళ్యాణ్ వెళ్తారా, లేదా అనే డౌట్ వినిపిస్తుంది. ప్రస్తుతం పవన్ ఏపీ రాజకీయాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మరి పవన్ ఇటలీ వరకు వెళ్తారా అనేది చూడాలి.