Arjun Chakravarthy : టాలీవుడ్‌ ఫస్ట్ స్పోర్ట్స్ బయోపిక్.. ఆ కబడ్డీ ప్లేయర్ కథని..

టాలీవుడ్ లో ఇప్పుడువరకు పొలిటికల్, సినిమా రంగం వారికీ చెందిన బయోపిక్స్ ఆడియన్స్ ముందుకు వచ్చాయి. ఇప్పుడు స్పోర్ట్స్ పర్సన్ కి సంబంధించిన..

Arjun Chakravarthy : టాలీవుడ్‌ ఫస్ట్ స్పోర్ట్స్ బయోపిక్.. ఆ కబడ్డీ ప్లేయర్ కథని..

Tollywood first sport biopic movie Arjun Chakravarthy

Arjun Chakravarthy : బయోపిక్ ల ట్రెండ్ నార్త్ లో ఎక్కువ కనిపిస్తుంటుంది. స్పోర్ట్స్ పర్సన్స్ నుంచి మొదలుపెట్టి సోషల్ రీఫార్మర్ వరకు ప్రతి ఒక్కరి బియోపిక్స్ ని తీసుకుంటూ వస్తున్నారు. ఇక టాలీవుడ్ కి వస్తే.. ‘మహానటి’ సినిమాతో ఇక్కడి వారికి కూడా వాటిపై చూపు మళ్లింది. ఈక్రమంలోనే పొలిటికల్, సినిమా రంగం వారికీ చెందిన బయోపిక్స్ ఆడియన్స్ ముందుకు వచ్చాయి. ఇప్పుడు స్పోర్ట్స్ పర్సన్ కి సంబంధించిన సినిమా తెరకెక్కబోతుంది. టాలీవుడ్ లో రూపొందుతున్న మొదటి స్పోర్ట్స్ సినిమా ఇదే.

1980లలో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన కబడ్డీ ఆటగాడు ‘అర్జున్ చక్రవర్తి’. అతడి జీవిత కథ ఆధారంగా గ్రామీణ అంశాలను, ఆట కోసం పోరాటాలు, విజయాలతో సినిమాని ఎమోషనల్ ఆడియన్స్ ముందుకు తీసుకు వచ్చేందుకు మేకర్స్ సిద్ధమవుతున్నారు. ఈ సినిమాకి “అర్జున్ చక్రవర్తి: జర్నీ ఆఫ్ యాన్ అన్‌సంగ్ ఛాంపియన్” అనే టైటిల్ ని ఖరారు చేశారు. ఈ మూవీ గురించి ప్రేక్షకులకు తెలియజేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ ని కూడా రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ లో అర్జున్ చక్రవర్తి స్టేడియం మధ్యలో నిలబడి, మెడల్ పట్టుకుని, గర్వంగా కనిపిస్తున్నాడు.

Tollywood first sport biopic movie Arjun Chakravarthy

Also read :Rashmika : రష్మికని ఇంకో పెళ్లికి.. ఒకే చెప్పొదంటూ సలహా ఇస్తున్న రణబీర్..

దర్శకుడు విక్రాంత్ రుద్ర కాలం మరిచిపోయిన ఈ హీరోని తన సినిమా ద్వారా ఇప్పటి జనాలకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాడు. అర్జున్ చక్రవర్తి పాత్రని విజ‌య రామ‌రాజు పోషిస్తున్నాడు. సిజా రోజ్ ముఖ్య పాత్ర చేస్తుంది. అజయ్, దయానంద్ రెడ్డి, అజయ్ ఘోష్ మరియు దుర్గేష్ సహాయక తారాగణంగా కనిపించనున్నారు. విఘ్నేష్ బాస్కరన్ సంగీతం అందించబోతున్నాడు. తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కించి హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో డబ్ చేసి రిలీజ్ చేయనున్నారు.