‘వస్తున్నా.. వచ్చేస్తున్నా.. వద్దంటే వదిలేస్తానా’..

నేచురల్ స్టార్ నాని, సుధీర్ బాబు, నివేధా థామస్, అదితిరావు హైదరి నటిస్తున్న ‘వి’ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్..

  • Publish Date - March 10, 2020 / 07:19 AM IST

నేచురల్ స్టార్ నాని, సుధీర్ బాబు, నివేధా థామస్, అదితిరావు హైదరి నటిస్తున్న ‘వి’ నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్..

నేచురల్ స్టార్ నాని, సుధీర్ బాబు ప్రధాన పాత్రల్లో.. ఇంద్రగంటి మోహన్ కృష్ణ రూపొందిస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్.. ‘వి’.. వైవిధ్యభరితమైన సినిమాలతో వరుస హిట్స్ అందుకుంటున్న ఇంద్రగంటి.. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో ‘వి’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. నాని నటిస్తున్న 25వ సినిమా ఇది. నివేధా థామస్, అదితిరావు హైదరి ఫీమేల్ లీడ్స్. దిల్ రాజు నిర్మిస్తున్నాడు.

 

ఇటీవల విడుదల చేసిన ‘మనసు మరీ మత్తుగా తూగిపోతున్నదే ఏమో ఈ వేళ’.. పాటకు మంచి స్పందన వచ్చింది. తాజాగా ‘చూస్తున్నా.. చూస్తూనే ఉన్నా’ అనే మరోపాట రిలీజ్ చేశారు. అమిత్ త్రివేది ట్యూన్ కంపోజ్ చేయగా సిరివెన్నెల అందమైన పదాలు రాశారు. ‘మెలోడి క్వీన్’ శ్రేయ ఘోషల్, అమిత్ త్రివేది, అనురాగ్ కులకర్ణి కలిసి పాడారు. ఉగాది కానుకగా మార్చి 25న ‘వి’ చిత్రాన్ని ప్రేక్షకులముందుకు తీసుకురానున్నారు. 

See More :

బాలయ్య, బి.గోపాల్.. ఆరోసారి!

తారక్ ఫ్యామిలీతో హోలీ