Veeraya, Veerasimha Reddy ticket prices going up?
Chiru – Balayya : ఈ సంక్రాంతి బరిలో చిరంజీవి, బాలకృష్ణ పోటీ పడుతున్న సంగతి తెలిసిందే. జనవరి 12న బాలయ్య – వీరసింహారెడ్డిగా, 13న చిరు – వాల్తేరు వీరయ్యగా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే ఈ మూవీల నుంచి పోస్టర్లు, టీజర్స్ అండ్ సాంగ్స్ రిలీజ్ అయ్యి ఆడియన్స్‌లో అంచనాలు అమాంతం పెంచేశాయి. దీంతో ఈ సినిమాలను ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఎదురు చూస్తున్నారు సాధారణ ప్రేక్షకులు సైతం.
Chiranjeevi: సంక్రాంతికి మెగాస్టార్ డబుల్ ట్రీట్.. ఎక్కడ చూసినా చిరంజీవే!
అయితే ఈ చిత్రాలకి సంబంధించిన ఒక న్యూస్ విని అందరూ నిరాశ చెందుతున్నారు. అదేంటంటే ఈ సినిమా టికెట్ రేట్లు పెంచే ఆలోచన చేస్తున్నారట మేకర్స్. ఈ రెండు చిత్రాలని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. వీరసింహారెడ్డి రూ.70 కోట్లతో తెరకెక్కితే, వాల్తేరు వీరయ్య దాదాపు రూ.100 కోట్ల బడ్జెట్‌తో తెరక్కింది. దీంతో నిర్మాతలు పెట్టుబడులను రాబట్టుకొనేందుకు టికెట్ రేట్స్ పెంపు విషయమై ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ సీఎంఓని కూడా కలిసినట్లు సమాచారం.
దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది అంటూ సినీవర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. గతంలో టికెట్ రేట్ పెంపు వల్ల కొన్ని సినిమాలు బాగా నష్టపోయాయి. మరి ఇప్పుడు ఈ పెంపుని ఆడియన్స్ ఆహ్వానిస్తారా? లేదా? అనేది చూడాలి. కాగా వీరసింహారెడ్డిని మలినేని గోపీచంద్ దర్శకత్వం వహిస్తుండగా వీరయ్యని కె బాబీ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలో హీరోయిన్‌గా శృతిహాసన్ నటిస్తుంది.