Venkat : ఒకప్పటి హిట్ హీరో.. ఇప్పుడు మళ్ళీ రీ ఎంట్రీ.. సినిమా రిలీజ్ ఎప్పుడంటే..
ఇటీవల పవన్ కళ్యాణ్ OG సినిమాలో గెస్ట్ రోల్ చేసి రీ ఎంట్రీ ఇచ్చాడు. (Venkat)
- Saketh U
- Published On : March 31, 2026 / 06:46 AM IST
Venkat
Venkat : శ్రీ సీతా రాముల కల్యాణం చూతము రారండి, అన్నయ్య, ప్రేమ కోసం, శివ రామరాజు లాంటి.. పలు సినిమాలతో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఒకప్పుడు ఫుల్ బిజీగా ఉన్న వెంకట్ మధ్యలో కొన్నాళ్ళు గ్యాప్ తీసుకున్నాడు. ఇటీవల పవన్ కళ్యాణ్ OG సినిమాలో గెస్ట్ రోల్ చేసి రీ ఎంట్రీ ఇచ్చాడు. ఇప్పుడు వెంకట్ హరుడు అనే సినిమాతో హీరోగా రీ ఎంట్రీ ఇస్తున్నాడు.
విఆర్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో రాజ్ తాళ్లూరి దర్శకత్వంలో వెంకట్ హీరోగా మాస్ కమర్శియల్ ఎంటర్టైనర్ గా ‘హరుడు’ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో హెబ్బపటేల్ , సలోని , నాటషా ,అలీ,సుమన్,రవి వర్మ, సుభాశ్రీ.. పలువురు కీలక పాత్రలు పోషించారు.
Also Read : Sailesh Kolanu : ‘ఏంటో అంతా సరికొత్తగా’ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన శైలేష్ కొలను..
ఇప్పటికే ఈ సినిమా టీజర్ రిలీజ్ చేయగా తాజాగా హరుడు సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేశారు. సమ్మర్ స్పెషల్ గా ఈ సినిమా మే 8న థియేటర్స్ లో వరల్డ్ వైడ్ రిలీజ్ కానుంది. ఇది కంప్లీట్ మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ అని వెంకట్ గారికి ఇది కంబ్యాక్ సినిమా అవుతుందని నిర్మాతలు తెలిపారు.
